Dharmavaram Taluka Janapada Geyalu / ధర్మవరం తాలూకా జానపద గేయాలు
Acharya Chigicherla Krishna Reddy / ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి · Literature

Price: Rs. 180. ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి నాకు ఆదిమ విద్యార్థి. నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళలో ఎం.ఏ. తెలుగు చదివాడు. నా మిత్రుడు ఆచార్య హెచ్.ఎస్. బ్రహ్మానంద దగ్గర ఎం.ఫిల్. చేశాడు. ఆ పరిశోధన గ్రంథం ఇది. ఈ గ్రంథం పునర్ముద్రణ పొందడం అనినందించదగిన అంశం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేసి, ఉద్యోగ విరమణ చేసినాక, తన కృషినంతా ఒక్కసారిగా సమాజానికి అందుబాటులోకి తెస్తున్నాడు. అందులో ఆదిమగ్రంథం. ఈ "ధర్మవరం తాలూకా జానపదగేయాలు" ఇది కృష్ణారెడ్డి తొలిరచన. ఈ పుస్తకానికి మరో ప్రత్యేకత ఉంది. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జానపద సాహిత్యం మీద జరిగిన తొలిపరిశోధన ఇదే. మా దగ్గర జానపద సాహిత్యం మీద జరిగిన తర్వాత పరిశోధనలకు ఈ గ్రంథం ఒరవడి దిద్దింది.