Dhamera Kavitha Sarvaswam

Editor · New Arrivals

Dhamera Kavitha Sarvaswam book cover

Price: Rs. 360. ఒక ఉద్వేగశీల ఉద్యమకవితల్ని అప్పుడప్పుడు పత్రికల్లో చదవడం ఆ సమయానికి గొప్ప స్ఫూర్తిదాయక పాఠకానుభవం. కాని నాలుగు దశాబ్దాలుగా ఒకే భావతీవ్రతతో, ధిక్కారస్వరంతో రాసిన యుద్ధ ప్రకటనల్లాంటి కవిత్వమంతా ఏకబిగిన చదవడం అద్భుతమైన అనుభవం. అలాంటి అరుదైన అవకాశం నాకు దామెరరాములు కవిత్వం ఇచ్చింది. అనంతమైన కాలరేఖమీద అరవై ఎరుపు వసంతాలను పూయించిన కవి కవిత్వాన్ని చదవడం రణస్థలిలో తిరుగాడినట్లుగా ఉంది. ఎమర్జెన్సీ చీకటిరోజుల నుంచి ఆధిపత్య వలసపాలన విముక్తి వరకు పోరాటోద్యమాల ప్రయాణంగా ఎన్నో జీవనానుభవాల్ని అందించింది. కనురెప్పవాల్చకుండా కోటచుట్టూ పారాహుషారంటూ ఎలుగెత్తి అరిచే కాపలాదారుడీ కవి. నిరంతరం యుద్ధం చేసే సైనికుడి ఆయుధం ఎంత పదునుగా వుంటుందో దామెరరాములు అక్షరం అంత పదునుగా ఉంటుంది. ఎంతటి బలవంతుడినైనా ఎదుర్కోవడానికి అదునుకోసం ఎదురుచూసే వీరుడిలా పొంచి ఉంటుందీ వాక్యం. ఇప్పుడీ వాక్యాలన్నీ ఒకసర్వస్వంగా రావడం ఒక చారిత్రాత్మక ఆయుధాగారం మన చేతుల్లోకి వచ్చినట్లుగా వుంది. భవిష్యత్తు కదనరంగంలోకి కదనుదొక్కడానికి సిద్ధంగావున్న కొత్తతరానికి కవిత్వడంప్ ఈ సర్వస్వం.

Browse more Telugu books