Dhalith Panthars Charithra
Editor · Politics

Price: Rs. 165. దళిత ఉద్యమ యవనిక మీదికి బెబ్బులిలా దూసుకొచ్చి ప్రభంజనం సృష్టించింది దళిత్ పాంథర్స్! 1972లో మహారాష్ట్రలో పురుడు పోసుకున్న ఈ బృందం ఐదేళ్లపాటు సమకాలీన సామాజిక రాజకీయ రంగాలను ఓ ఊపు ఊపింది. దళితుల్లో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని తట్టిలేపి కులవ్యవస్థకు వ్యతిరేకంగా, ముఖ్యంగా అగ్రకుల పీడనపై ప్రతిఘటించేలా సరికొత్త స్థైర్యాన్ని నూరిపోసింది. యువతను అమితంగా ఆకట్టుకొన్న ఈ బృందం హైందవ మత భావజాలాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ దళితుల రాజ్యాంగ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం బలమైన పోరాటాన్ని నిర్మించింది. దీని ఆయుష్షు తక్కువే అయినా దేశంలో దళిత ఉద్యమానికి ఇది బలమైన భూమికను నిర్మించింది. పోరాటానికి అవసరమైన సైద్ధాంతిక సాధన సంపత్తినీ అందించింది. వ్యవస్థలన్నింటినీ గడగడలాడించింది. దీని ప్రస్థానాన్ని సమగ్రంగా మనముందు ఆవిష్కరించే రచన ఇది. అంతేకాదు. నాయకత్వంలో అనైక్యత, రాజీధోరణుల కారణంగా కాలక్రమంలో అదెలా నిర్వీర్యమైందో, తదనంతర పరిణామాలేమిటో కూడా అంచనా వేస్తుంది! "బ్రాహ్మణ స్త్రీలను వివస్త్రను చేయటం ఎక్కడన్నా విన్నామా? కానీ దళిత స్త్రీలను మాత్రం చెరబట్టి వివస్త్రలను చేయటమన్నది తరచూ ఎదురయ్యే అనుభవమే. దీనికి శిక్ష ఏమిటి? నెల జైలు లేదా 50 రూపాయల జరిమాన. జాతీయ గీతం పాడుతున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడని వ్యక్తికి విధించే జరిమానా 300 రూపాయలు. అదే ఒక స్త్రీని వివస్త్రను చేసి అవమానిస్తే విధించే జరిమానా కేవలం 50 రూపాయలు. ఒక మనిషిని అత్యంత హీనంగా అవమానించినప్పటి బాధకంటే ఓ చిహ్నాన్ని అవమానించినప్పటి బాధ ఎక్కువా? దళిత మహిళల గౌరవమర్యాద ఓ చీర పాటి ఖరీదు చెయ్యదా?" "