Debbaku Edumandhi

Editor · Children's Books

Debbaku Edumandhi book cover

Price: Rs. 90. బాల సాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషి చేస్తున్న ప్రముఖ రచయిత డా॥ ఎం. హరికిషన్. వీరు పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదువుకునేలా రాయటంలో సిద్ధహస్తులు. జానపద సాహిత్యంలో వీరు చేసిన కృషి అద్భుతం, అమూల్యం. వీరు గత పది సంవత్సరాలుగా పల్లెల్లో తిరుగుతూ అంతరించిపోతున్న జానపద బాలసాహిత్యాన్ని వెలికితీస్తూ, వాటిని పరిష్కరిస్తూ, ప్రచురిస్తూ తెలుగు జాతికి అమూల్యమైన సేవ చేస్తున్నారు. ఠంగురుబిళ్ళ, కిర్రు కిర్రు లొడ్డప్పా, ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ, నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, నాకు మూడు-నీకు రెండు అనే పేర్లతో ఆ జానపద సాహిత్యాన్ని ప్రచురించారు. వీరు విశాఖపట్టణం జిల్లా పాడేరు ప్రాంతంలోని గిరిజన భాషయైన 'కొండ'కు సంబంధించిన జానపద కథలు గూడా సేకరించి 'బంగారుచేవ-గంధర్వకన్య' అనే పేరుతో వెలువరించారు. తెలుగు భాషలో అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో 'ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కధలు సృష్టించారు. ఉపాధ్యాయులైన వీరు 'కేతు విశ్వనాథరెడ్డి కథలు- సామాజిక దర్శనం' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కర్నూలు జిల్లాలోవున్న కథకులను, వారి కథలను సాహితీలోకానికి పరిచయం చేసే బృహత్ సంకలనం 'కర్నూలు కథ' వీరి సంపాదకత్వంలోనే వెలువడింది. వీరు బాలసాహిత్యాన్నే గాక... పీడితులు, పేదలవైపు నిలబడుతూ, సామాజిక స్పృహ కలిగిన ఇతర రచనలు గూడా అనేకం చేశారు. మాయమ్మ రాచ్చసి, నయాఫత్వా, నేను- మాయమ్మ, మూడు అబద్ధాలు వీరి సామాజిక నిబద్ధతను తెలియజేసే కథాసంపుటాలు. వీరు రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న బాధలను వివరిస్తూ, ప్రయివేట్ పాఠశాలల దోపిడీని నిరసిస్తూ, బాలల స్వేచ్ఛా ప్రపంచాన్ని కలగంటూ, వారి హక్కులకోసం నినదిస్తూ 'ఒక చల్లని మేఘం' అనే కథల సంపుటిని కూడా ప్రచురించారు.

Browse more Telugu books