Dasya Vimukthi Kosam Mathamarpidi

Prabhakar Mandara / ప్రభాకర్ మందార · Politics

Dasya Vimukthi Kosam Mathamarpidi book cover

Price: Rs. 55. నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను" డా॥ బి.ఆర్. అంబేడ్కర్ 1935లో చేసిన ప్రకటన యిది. అన్నట్టుగానే ఆయన 1956లో హిందూమతాన్ని విసర్జించి ఐదు లక్షల మంది అనుచరులతో కలిసి మరీ బౌద్ధమతంలో చేరారు. ఆ మధ్య కాలంలో ఆయన దళితుల దాస్య విముక్తి గురించీ, మతమార్పిడి ఆవశ్యకత గురించి వివిధ సభల్లో చేసిన ఉపన్యాసాల సంకలనమే ఈ పుస్తకం. చతుర్ వర్ణ వ్యవస్థ పునాదులు ఏమాత్రం చెక్కు చెదరకుండా అంటరానివాళ్లకు 'హరిజనులు' అనే కొత్త పేరును అంటగట్టి దళిత సమస్యకు ఓ పైపై పరిష్కారం చూపబోయారు గాంధీజీ. అయితే ఈ పేరు మార్పు వల్ల దళితులకు వొరిగేదేమీ లేదు: తమను అంటరానివాళ్లుగా, అధములుగా పరిగణించే హిందూమతాన్ని వదిలించు కుని బయటకు వచ్చినప్పుడే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుంది అంటారు అంబేడ్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు హిందూ మతంలో స్థానం లేదు. 'మిమ్మల్ని సాటి మనుషులుగా చూడని మతంలో, మీకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా.... ఆస్తి సంపాదించుకునే అవకాశం లేకుండా... చివరికి గుక్కెడు మంచి నీళ్లు కూడా పుట్టకుండా చేసిన మతంలో, మిమ్మల్ని జంతువులకంటే హీనంగా చూసే ఈ హిందూ మతంలో మీరెందుకు పడి వుండాలి?' అని ప్రశ్నిస్తారు. అంబేడ్కర్. ఇవాళ ప్రపంచ శాంతికి దోహదం చేయగల మతం ఏదైనా వుందంటే అది బౌద్ధం ఒక్కటే అంటారాయన. ఆలోచనాత్మకమైన ఈ ఉపన్యాసాలను తేట తెలుగు లోకి అనువదించిన ప్రభాకర్ మందార హైదరాబాద్లో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రజా సంబంధాల విభాగంలో పని చేస్తున్నారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కోసం పలు పుస్తకాలను అనువదించారు.

Browse more Telugu books