DAPPU
Editor · Best Selling

Price: Rs. 180. ప్రజాసాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు,కొత్తగొంతులు వినిపించేందుకు ప్రజాశక్తి సాహితీ సంస్థ నిర్వహించిన పోటీలలో ఎంపికైన కథల సంకలనం ఇది. బహుమతులు పొందినవీ సాధారణ ప్రచురణకు ఎంపికైనవీ కూడా చదవొచ్చు. మామూలు ఇతివృత్తాలకు భిన్నంగా జీవిత సమస్యలకూ సామాజిక పరిణామాలకూ అద్దం పడుతూ కథారచయితలు తమదైన శైలిలో స్పందించారు. మారిన కాలానికి ప్రతిరూపంగా గిగ్ వర్కర్ల వంటి అంశాలనూ సృశించారు. విభిన్న కథాంశాలతో వివిధ కోణాలను ఆవిష్కరించారు. తెలుగునాట ప్రగతిశీల కథా సాహిత్య చరిత్రలో ప్రథమ స్థానం ఆక్రమించిన ప్రజాశక్తి సంస్థ ప్రపంచీకరణ నేపథ్యంలో, సామాజిక సవాళ్లు సంఘర్షణల మధ్య మరోసారి ఈ సంకలనంతో ముందుకు రావడం మీ ఆదరణకు పాత్రమవుతుందని ఆశిస్తున్నాం.