Dalitulu Bharatha Rajyangam
Editor · New Arrivals

Price: Rs. 169. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన విముక్తి మాటను నిజంగా నిలబెట్టుకుందా? 'లేదు' అనే సమాధానం చెప్పుకోవాలి. 'దళితులు భారత రాజ్యాంగం' పుస్తకం ఒక సూటి ప్రశ్నను అడుగుతుంది: ఎవ్వరైతే తమ విముక్తి కోసం రాజ్యాంగం చేసిన వాగ్దానం పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారో ఆ దళిత సమాజం కోసం అది నిజంగా ఏం చేసింది? ఎక్కడ విఫలమైంది? ఈ విషయాలపై ప్రజా మేధావి, రాజకీయ ఆర్ధిక శాస్త్ర పండితుడు, మానవ హక్కుల ఉద్యమకారుడైన ఆనంద్ తెల్ తుంబ్లే ఈ పుస్తకాన్ని చాలా స్పష్టమైన, బలమైన వాదనలతో రాశాడు. జాతీయవాద రాజకీయాలు, రాజ్యాంగ రూపకల్పన నుండి మొదలుకొని.. అస్పృశ్యత నివారణ, రాజకీయాలు, విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు, లౌకికవాదం వంటి ముఖ్యమైన అంశాల గురించి, సమాజంలో రోజువారీగా సాగుతున్న అణచివేత గురించి ఇందులో చర్చించాడు. రాజ్యాంగ ఆశయాలు సమాజంలో బలంగా నాటుకుపోయిన అధికార శక్తులను ఎలా ఢీకొన్నాయో ఆయన చూపించాడు. కేవలం చట్టబద్ధమైన రక్షణలు ఉంటే సరిపోదని, సమాజ నిర్మాణంలో మార్పు రానంతవరకు నిజమైన సమానత్వం దక్కదని ఆయన స్పష్టం చేశాడు. ఈ పుస్తకంలో తెల్ తుంబ్లే నిరాశకు లోనవ్వకుండా, అలాగని గతాన్ని తలుచుకుంటూ కూర్చోకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. కేవలం గొప్ప మాటలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు; అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే, సామాజిక అలవాట్లను మార్చే సంస్థల ద్వారానే “రాజ్యాంగ నైతికత"ను పెంపొందించుకోవాలని ఆయన నొక్కిచెప్పాడు. చారిత్రక చర్చలు, నేటి సమాజంలో జరుగుతున్న వివక్షకు సంబంధించిన సాక్ష్యాలను చూపిస్తూ.. హక్కులు వాస్తవ రూపం దాల్చడానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలను, ఆచరణాత్మక మార్గాలను ఈ చిన్న పుస్తకంలో వివరించాడు. భారత రాజ్యాంగ పీఠిక (Preamble) ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎంతో స్పష్టతతో, లోతైన విశ్లేషణతో రాసిన ఈ పుస్తకం, భారతదేశ ప్రజాస్వామ్య ప్రాధాన్యతను మళ్లీ గుర్తుచేసుకోవాలనుకునే పౌరులకు, విద్యార్థులకు, పాలకులకు ఎంతో అవసరమైన పుస్తకం.