Dalitha Samasya Parishkaraniki
Ranganayakamma / రంగనాయకమ్మ · Politics

Price: Rs. 65. 'దళిత' సమస్య పరిష్కారానికి... ఏది ఉన్నతమైన సిద్ధాంతం అయితే ప్రపంచానికి నిజంగా అదే కావాలి. ఏది వెలుగుబాటని పరచగలదో అదే కావాలి. ఆ సిద్ధాంత కర్త, బుద్ధుడా, మార్క్సా, అంబే ద్కరా, మరొకరా అనేది అనవసరం. రోగాన్ని మాన్పగలిగేదే మందు! బాధల నించి ఏది విముక్తిని ఇస్తుందో అదే ఉన్నత మార్గం! అది బౌద్ధ ధర్మమే అయితే, తప్పకుండా దాన్నే అనుసరించాలి! దాన్నే ఆరాధించాలి! కానీ అసలు తేల్చుకోవలసింది, 'ఏది ఉన్నత మార్గం' అని! మొదట తేలాల్సింది అదీ! అలా తేలినదాన్ని తప్పకుండా అనుసరించవలసిందే! ప్రపంచంలో ఎక్కడ ఏ 'గురువు' ని చూసినా, ఏ 'తత్వ వేత్త' ని చూసినా, ఏ 'సిద్ధాంతాన్ని' చూసినా, అది, 'శ్రమ-'సంబంధాల' గురించీ, 'ఆస్తి హక్కుల' గురించీ, 'కలిమి లేముల' గురించీ, ఏం చెపుతోందో చూడాలి. ఆ బోధన, సమాజంలో ఏ పక్షంవేపు నిలబడిందో గ్రహించాలి. అలా గ్రహించకపోతే, సమాజంలో ఏ విషయాన్నీ అర్థం చేసుకో లేము. మన 'ఆత్మరక్షణ' మనం చేసుకోలేము. 'గురువు' గానీ, 'నాయకుడు' గానీ బోధించిన విష యాల్లో సరైనదాన్ని తీసుకుని సరికాని దాన్ని తిరస్క రించాలి. తప్పుల్నీ ఒప్పుల్నీ ఒకేరకంగా భరించకూడదు. 'ప్రేమ' అయినా, 'భక్తి' అయినా, విచక్షణా రహితంగా వుండకూడదు.