Daari Etu... / దారి ఎటు...
బి.ఎస్. రాములు / B. S. RAMULU · Literature

Price: Rs. 135. కాలం ఒక ప్రవాహం. సమాజం అనేక మలుపులు తీసుకుంటున్న కాలం ఇది. 1990 నుండి వేగం పుంజుకున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ కాలాన్ని పరిగెత్తిస్తున్నది. ప్రభుత్వం పరిశ్రమలను, బ్యాంకులను, జాతీయం చేయాలి అనే దశనుండి అందుకు భిన్నంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం జరుగు తున్నది. విద్య, వైద్య రంగాలు ప్రైవేటీకరణ కారణంగా పేదలకు అందకుండా పోతున్నాయి. గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు చౌకగా గృహవసతి కల్పించిన క్రమం ఆగిపోయి రియల్ ఎస్టేట్, ప్రైవేటు రంగం విస్తరించింది. దాంతో స్వంత ఇల్లు అనేది సుదూర కలగా మిగిలిపోతున్నది. ఇలా విద్య, వైద్యం, గృహవసతి, ఉపాధి, ఉద్యోగం అనేది ప్రజలకు దూరం అవుతున్నాయి. ప్రభుత్వం పెన్షన్ను కూడా తొలగించి పెన్షన్ కోసం స్వంతంగా జమ చేసుకోవాలి అనే విధానాన్ని ముందుకు తెచ్చింది. ప్రభుత్వం ప్రజలపట్ల తన కర్తవ్యాలను ఒక్కొక్కటి తగ్గించు కుంటూ ప్రైవేటీకరణకు అవకాశాలు కల్పిస్తున్నది. ప్రైవేటీకరణ వెర్రితలలు వేస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పెట్టుబడి దారులు, పెట్టుబడి, పారిశ్రామికవేత్తలు చాలా తక్కువ, ఇప్పుడు మిలయనీర్లు, బిలియనీర్లు పెరిగారు. బ్యాంకులనుండి రుణాలు తీసుకుని ఇతర రంగాలకు మళ్ళించి బ్యాంకులకు ఎగవేస్తున్నారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మాయా జాలంతో, రియల్ ఎస్టేట్, ల్యాండ్ స్కేప్తో ఎలాంటి సంపద సృష్టించకుండానే సంపన్నులపుతున్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ, బ్యాంకుల విధివిధానాలే కారణం. అలా బ్లాక్ మార్కెట్తో, ధరల పెరుగుదలతో సంపన్నులవుతున్నారు.