Cultural Commander Mastaarji
Dr. Pasunoori Ravinder / డా. పసునూరి రవీందర్ · Biographies & Auto Biographies

Price: Rs. 95. తెలుగు సాంస్కృతిక రంగాన్ని బహుజన విముక్తి దిశగా పదునెక్కించిన ప్రజావాగ్గేయకారుల్లో ముందువరసలో నిలిచే పేరు మాస్టార్జీ. ప్రజాయుద్ధనౌక గద్దర్ సరసన నిలుప తగినవాడు. తన ఏడుపదుల జీవితంలో అరవయేళ్లను కళకే అంకితం చేసిన సాంస్కృతిక సేనాని. ప్రజా ఉద్యమాలంటే మనకు విప్లవ, అభ్యుదయ ఉద్యమాలే గుర్తుకొస్తాయి. అలాగే ప్రజల పాటంటే ఎర్రజెండా పాటే అనే నానుడిని బద్దలు కొట్టినవాడు మాస్టార్జీ. తెలుగు సమాజంలో లక్షలాదిమందికి బహుజన సోయిని అందించిన మహావాగ్గేయకారుడు మాస్టార్జీ. మూలాల్లోకి వెళ్లి, ఆ చరిత్రనంతా వందలాది పాటల్లకు ఎక్కించి బహుజన రాజకీయాలు బోధించినవాడు. మూలవాసీ సిద్ధాంతాన్ని యాభై యేళ్ల క్రితమే తెలుగు నేలకు పరిచయం చేసిన దార్శనికుడు. అప్పటికే విప్లవోద్యమ పాట పెద్దెత్తున వెలువడుతున్న కాలంలో మాస్టార్జీ మాత్రం అంబేద్కరిస్ట్ సాంస్కృతిక ఉద్యమానికి పునాదులు వేసిన మహా రచయిత. నలుగురు నడిచే దారుల్లో ఎవ్వరైనా నడవగలరు. అలా కాకుండా కొత్త తొవ్వ వేయడం అందరివల్ల కాదు. అలాంటి ప్రత్యేకతను కలిగిన వాడు మాస్టార్టీ. మాస్టార్జీ పాటందుకుంటే అందులో బహుజన రాజకీయ పాఠమే ఉంటుంది తప్ప, ఊకదంపుడు ఉపన్యాసం ఉండదు. అలాంటి గొప్ప రచయితను రేఖామాత్రంగా పరిచయం చేస్తూ, ఆయన రాసిన వందలాది పాటలు ఏం డిమాండ్ చేస్తున్నాయో, అవి తెలుగు నేలకు ఏం నేర్పాయో విశ్లేషించడమే ఈ పుస్తక ప్రధానోద్దేశ్యం! - డా.పసునూరి రవీందర్