Congress Gandhi Antaranivariki Em Chesaru? series 17, 18

Editor · Politics

Congress Gandhi Antaranivariki Em Chesaru? series 17, 18 book cover

Price: Rs. 540. అంటరాని వాళ్ల రక్షకుడు గాంధీ... అంటూ అంటరాని వారిని బుట్టలో వేసుకునేందుకు కాంగ్రెసు ఎప్పుడూ సందేహించలేదు. కాంగ్రెసువాదులు ఒక్కరే కాదు... దేశం మొత్తం గాంధీని నిజమైన రక్షకుడనే భావించారు. వాళ్లు మరింత ముందుకు వెళ్లి.. గాంధీ ఒక్కరే నిజమైన రక్షకుడు అంటూ అంటరానివారి చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పారు. ఆధారాలు చూపించమని అడిగినపుడు- అంటరాని వారి కోసం ప్రాణాలు అర్పించేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ వాగ్దానం చేసింది గాంధీ ఒక్కరు మాత్రమేననీ, అలా ఎవరూ చేయలేదని చెబుతారు. పూనా ఒప్పందం కింది అంటరాని వారికి రాజకీయ హక్కులు లభించడానికి గాంధీయే కారణమని కూడా అంటరాని వారికి చెప్పారు. ఇలా చెప్పడానికి వారికి ఎలాంటి అనైతికత అడ్డురాలేదు. అలాంటి దుష్ప్రచారానికి (ప్రోపగాండా) ఒక ఉదాహరణ. 1945 ఏప్రిల్ 12న పెషావర్ లో జరిగిన అంటరాని వాళ్ల సమావేశంలో రాయ్ బహదూర్ మెహర్చంద్ ఖన్నా ఇలా మాట్లాడినట్లు తెలుస్తున్నది. డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

Browse more Telugu books