Congress Gandhi Antaranivariki Em chesaru! series 17
Editor · Politics

Price: Rs. 315. భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టం -1935 కింద 1937లో ప్రావిన్సుల చట్టసభలకు జరిగిన ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈ సామెత గుర్తుకొచ్చింది. కాంగ్రెస్ వాళ్లు వాస్తవానికి "Causa finita eat: India locuta est.” అని చెప్పలేదు. ఎన్నికల్లో కాంగ్రెసును వ్యతిరేకించిన పార్టీలన్నీ ఈ మాటనే వల్లెవేశాయి. కారణం... వారి లెక్కల ప్రకారం... ఫలితాలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా వచ్చాయి. రౌండు టేబుల్ కాన్ఫరెన్సుల్లోనూ, ఉమ్మడి పార్లమెంటరీ కమిటీలోనూ వరుసగా అయిదేళ్లపాటు కాంగ్రెసుకు వ్యతిరేకంగా అంటరానివాళ్లకు నాయకత్వం వహించాను. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఉండదని నేను అనుకోలేదు. నా వరకూ ఇదీ ప్రశ్న... అంటరానివాళ్లు... కాంగ్రెసు వైపునకు తిరిగిపోయారా? అదే జరిగితే... నా వరకూ అది అనూహ్యం. కాంగ్రెస్ మాయలో పడి... వారిచ్చే ప్రలోభాలకు లొంగిపోయి వెన్నుపోటు పొడిచే కొద్దిమంది కాంగ్రెసు ఏజంట్లు తప్ప... అంటరానివాళ్లలో- అందరూ కాంగ్రెసుకు గంపగుత్తగా మద్దతు ఇస్తారని అంటే నేను నమ్మను. అంటరాని వారి రాజకీయ రక్షణ డిమాండ్లను అడుగడుగునా వ్యతిరేకించిన గాంధీ, కాంగ్రెసు పార్టీలను వారు అంత తేలికగా మర్చిపోతారని కూడా నేను అనుకోను.