Communistlu Burjuva Parlamentaree, Ennikallo Palgonavachhuna, Ledha?
Editor · Politics

Price: Rs. 36. దాదాపు 100 ఏళ్ళగా, ప్రపంచ దేశాల్లో, ఎక్కడ కమ్యూనిస్టులు వుంటే అక్కడ, దోపిడీ పాలక వర్గాన్ని కూలదోయడం గురించి చర్చలపై చర్చలు జరుగుతూనే వున్నాయి. ఆ చర్చలు ఏమిటంటే, కమ్యూనిస్టు సమాజాన్ని- శాంతియుతంగా, పార్లమెంటరీ పంధాలోనే ఏర్పర్చగలమా? లేకపోతే సాయుధ పోరాటం ద్వారా ( దోపిడీ వర్గ పాలనని "బలవంతంగా కూలదోయడం ద్వారానే") సాధిస్తామా అని. ఈ రకం వాదనలు ఈ నాటికీ జరుగుతూనే వున్నాయి. ఆ వాదనలు, భారత దేశంలో, తెలుగు ప్రాంతాలలో కూడా వున్నాయి. ఆ వాదనలలో ఏ వాదనని సరైన వాదనగా అంగీకరించాలీ, దానికి తగినట్టు ఎలా పని చేయాలీ-అనే విషయాల గురించి, పాఠకులు నన్ను అడుగుతూ వుంటారు. నేను 'కాపిటల్ పరిచయం' రాశానని, కాబట్టి, నాకు అది తెలుస్తుందని కొందరు పాఠకుల నమ్మకం. కానీ, నేను ఆ విషయాలు చెప్పగలనా? బూర్జువా పాలక వర్గాన్ని ఎలా తీసి వేయాలో దాన్ని గురించి తగినంత స్పష్టత నాకు వుంటుందా? లేదు. కాబట్టి, 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక' నించీ మొదలు పెట్టి, 'కాపిటల్ వరకూ వున్న రచనలలో, పాఠకుల ప్రశ్నలకు అవసరమైన జవాబుల కోసం, వెతకవలిసి వచ్చింది. అంతే కాదు. ఈ విషయం మీద లెనిన్ ప్రత్యేకంగా రాసిన ఒక పుస్తకాన్నీ, అదే కాలంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ జరిగిన వాదనల్నీ కూడా చూడడం అత్యవసరం అయింది. ఆ వాదనలన్నిటినీ పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయత్నించాను. ఇది, ఒక రకమైన చర్చా వ్యాసం లాంటిదే.