Cinigeetavaranam
Editor · Literature

Price: Rs. 585. పాటకి పల్లవి ప్రాణం అయితే పరిమళం చైతన్యం. మనసంతా దిగులు మేఘాలు కమ్ముకుని గుబులు రేకెత్తిస్తున్నప్పుడు పాట సొంత్సన పరుస్తుంది. మనసంగా ఉత్సాహం నిండుకుని ఉల్లాసంగా ఉన్నప్పుడు పాట ఆ సంతోష సమయాన్ని మరింత సాంద్రతరం చేస్తుంది. జీవితంలోని ప్రతి అంశానికి పాటే చేదోడు వాదోడు, పాటే తోడూ నీడా! తెలుగు సినిమా పాటల రచయితల వరకు ఇదొక పునాది. ఇదొక దిక్పూలి. ఇదొక దారి దీపం ఈ పునాది మీద ఒక గొప్ప సౌధాన్ని భవిష్యత్ తరాలు నిర్మిస్తాయని ఆశిద్దాం. - వంశీకృష్ణ బతుకులోని ప్రతీ సందర్భానికీ పాట ఒక ప్రేరణ, ఓదార్పు, చైతన్యపు చెలిమి, పనితోపాటుగ గొంతు విప్పుతుంది పాట, శ్రమలో తానై సరిగమలను శ్రుతి చేస్తుంది. గమనాలకు గమకాలను తోడిస్తుంది. ఇలా పాట గురించి ఎంతయినా చెప్పవచ్చు. జీవితాలతో జీవన గమనాలతో ఇంతటి సంబంధం కలిగి వుంది కావునే పాటకు ప్రభావశీలత మెండుగా వుంది. అందుకనే నాటి నుండి నేటి వరకు సినిమాలలోనూ పాట ప్రాముఖ్యాన్ని పొందుతూవుంది. సినిమా సాహిత్యమూ, సంగీతమూ మన నిత్య జీవితంతో అనుబంధాన్ని కలిగే వుంది. - కె. ఆనందాచారి