CHIVARI GUDISE

డా॥ కేశవరెడ్డి /Dr.Kesava Reddy · Novels

CHIVARI GUDISE book cover

Price: Rs. 126. చివరి గుడిసె’ బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమయిన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటిరాగల రచనలు. అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా రచయితలు ఒకే కాలానికీ, ఒకే వ్యవస్థకు చెందిన వైరుధ్యాల్ని చిత్రించగా డాక్టర్ కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుధ్యాల్నీ, భూమిపైనా, పాతాళంలోనూ కూడా జరిగే పోరాటాన్నీ అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించాడు ఈ నవలలో. తన మొదటి కథల్లోలానే ఇందులో కూడా గ్రామంలోని అగ్రవర్ణాలకూ, నిమ్నవర్గాలకూ జరిగే సంఘర్షణే స్థూల ఇతివృత్తం. కాని ఈసారి కథాకాలం దాదాపు యాభై ఏళ్ళ వెనక్కు జరిగింది. అక్కడ నుండి మరొక ఇరవయ్యేళ్ళు వెనక్కుపోయి చెప్పుకొస్తాడు కథని. అంటే సుమారు 1925 నుండి 45 మధ్య కాలంలో జరిగిన కథ. స్పష్టంగా తేదీలు ఇవ్వకపోయినప్పటికీ ఈ కథలోని ప్రతి సంఘటనా తన నిర్దిష్ట చారిత్రక నేపథ్యాన్ని ఎంతో స్పష్టంగా ప్రకటిస్తూనే వుంటుంది.

Browse more Telugu books