Chinalo Em Jaruguthondi ?

రంగనాయకమ్మ / Ranganayakamma · Politics

Chinalo Em Jaruguthondi ? book cover

Price: Rs. 45. బెతల్హామ్ చైనా గురించి రాసిన "మావో తర్వాత చైనా" వ్యాసమే ఈ తెలుగు పుస్తకానికి మూలం. ఈ పుస్తకం - 1976లో మావో మరణం తర్వాత, వెంటనే పార్టీలో పెట్టుబడిదారీ మార్పులు చకచకా ప్రారంభం కావడమూ, మావో పంధా నాయకులు జైళ్ళ పాలవడమూ – వంటి సంఘటనల్ని వివరిస్తూ, పార్టీలో పరిణామాల గురించి చర్చిస్తుంది. కానీ మావో తర్వాత 1976 నించీ జరిగిన విషయాలు అర్ధం చేసుకోవాలంటే, అంతకుముందు కాలంలో జరిగిన విషయాలు కూడా కొంచెం తెలిసి వుండాలి. 1949లో రాజ్యాధికారాన్ని తీసుకున్న కమ్యూనిస్టు పార్టీలో ఆనాటినించి 1976 దాకా ఏం జరిగింది? — ఈ సమాచారం అంతా సేకరించి, మొదటి ముద్రణలోనే ఒక పెద్ద 'ముందుమాట' ఇచ్చాము. అంతేగాక, బెతల్హామ్ ఇచ్చిన సమాచారాన్ని ఎక్కువ వివరంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా చాలా ఫుట్నట్లు కూడా ఇచ్చాము. బెతల్హామ్ ఇచ్చిన సమాచారం 1978 తోనే అగిపోతుంది. మేము ఈ అనువాదాన్ని ఇచ్చింది 1983 లో. కాబట్టి 1978 నించీ, 1983 వరకూ ఏం జరిగిందో ఆ సమాచారాన్ని కూడా సంపాదించి, మొదటి ముద్రణలోనే, పుస్తకానికి చివర్లో ఇచ్చాము. ఇప్పుడు, ఈ 2వ ముద్రణలో కూడా, చైనా గురించి 1983 నించీ 2002 వరకూ, దొరికిన సమాచారాన్ని మళ్ళీ ఈ పుస్తకానికి చివర్లో చేర్చాము.

Browse more Telugu books