Chilee maro september 11

Editor · History

Chilee maro september 11 book cover

Price: Rs. 25. సెప్టెంబరు 11 అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదులు జరిపిన దాడి. కాని 1973లో కచ్చితంగా అదే రోజు చిలీలో మరో ఘోర దురంతం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సాల్వెడార్ అలెండీ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని అమెరికా ప్రోద్బలంతో పినోచెట్ కూలద్రోసి సైనిక నియంతృత్వాన్ని నెలకొల్పాడు. దేశాన్ని రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరూడాలతోపాటు ఈ ఘోరకలికి ప్రత్యక్ష సాక్షులైన వారు రాసిన వ్యాసాలు, గేయాలు, ప్రసంగాల సంకలనం 'చిలీ, మరో సెప్టెంబరు 11. హవానాలో జరిగిన సంఘీభావ సభలో క్యూబానేత ఫైడెల్ కాస్ట్రో అలెండీ త్యాగాన్ని, ధీరత్వాన్ని శ్లాఘిస్తూ ఎంతో ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. అది కూడా ఇక్కడ పొందుపరచబడింది.

Browse more Telugu books