hild Marriages
Asmita / అస్మిత · History

Price: Rs. 45. అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ మరియు కౌన్సిల్ ఫర్ సోషల్ డవలప్మెంట్ సంస్థలు కలిసి Ford ఫౌండేషన్ సహకారంతో - Combating child marriage, eliminating discrimination against the girl child అనే మూడు సం||ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ క్రింద 2012లో గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కర్నూలు జిల్లాల్లో, వివిధ స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ లీడర్లు, ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ టీచర్లతో - "బాల్య వివాహాల నిషేధం పౌర సమాజం పాత్ర" అనే అంశంపై ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాం. ఈ సమావేశాల ద్వారా - సమాజంలో బాలికలపట్ల వున్న వివక్ష, వారిని పెళ్ళిచేసి వదిలించుకోవాలనే ధోరణి, పెళ్ళి ఎప్పుడు జరిగినా అది శుభకార్యమే అనే భావన బాల్య వివాహాలకు దారితీస్తున్న కొన్ని కారణాలు. ఈ బాల్య వివాహాల వల్ల బాలికలు విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారు. చదువుకునే హక్కు, జీవించే హక్కు వంటి మానవ హక్కులకు దూరమతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం క్రింద నియమ నిబంధనలు (State rules) రూపొందించి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బాల్య వివాహ నిషేధ అధికారుల నియామకాలు జరిపింది. అయితే ఆయా అధికారులకు ఈ నియామకాల గురించిన సమాచారమే తెలియదు. పైగా వారికిది అదనపు బాధ్యత. అలాగే ప్రభుత్వం ఈ బాల్య వివాహ నిషేధ చట్టం గురించి ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించ లేదు. ఫలితంగా ఈ చట్టం గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు. అనే విషయం వెల్లడైంది. మేధావులు, రచయితలు బాల్య వివాహపు సమస్యపై వందేళ్ళుగా స్పందిస్తూనే వున్నారు. తమ రచనల ద్వారా బాల్య వివాహాల్లో - బాలికల స్థాయి, స్థితిగతులను, సమాజం, కుటుంబం, ప్రభుత్వాల పితృస్వామ్య ధోరణులను బాలికల శ్రమ, లైంగికత్వంపై కంట్రోలును విమర్శించారు. కాబట్టే అక్కిరాజు ఉమాకాన్తమ్ గారి వందేళ్ళ నాటి కథ అన్నపూర్ణను ఇందులో చేర్చటం సమంజసంగా భావించాం. అలాగే ప్రముఖ చరిత్ర కారులు వకులాభరణం రామకృష్ణ గారి వ్యాసాన్ని, (మరో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి) ఓల