Chikatlo Suryudu
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Education & Science

Price: Rs. 95. తెలుగులో సైన్సు ఫిక్షన్ చాలా తక్కువ. సైన్సు ఫిక్షన్ రావడానికి దేశంలో కొంతైనా సైన్సు వాతావరణం వుండాలి. ముఖ్యంగా పాపులర్ సైన్సు పుస్తకాలు విరివిగా లభ్యమై, వాటికి తగినంతమంది పాఠకులు వుండాలి. రచయితలైన వారు సైన్సు పట్ల ఆసక్తి కలవారై వుండాలి. లేదా సైంటిస్టులైన వారు కథారచనలో నేర్పు కలవారై వుండాలి. లేకపోతే సైన్సు నవలలు రావు. తెలుగులో అసలు లేవనికాదు. మాకు కాలేజీ రోజులలో తేకుమళ్ళ రాజగోపాలరావుగారు వ్రాసిన “విహంగయానం” నవల నాన్స్టిటెయిల్డుగా వుండేది. దాన్ని ఆయన ఆంధ్రదేశపు నేపథ్యంలో వ్రాశారు. పెద్దాపురం(?) మహారాణి అందులో ఒక పాత్రే. ఆకాశంలో సందర్శించే ఒక విహంగం లాంటి విమానం. వుంటుంది. నీటి అడుగున విహరించడానికి నివాతకవచం (ఎయిర్ టైట్ సూట్) వుంటుంది. (పూర్వకాలంలో నివాత కవచులనే రాక్షసులు, సముద్రంలో నివసించేవారట.) ప్రతి అభూత కల్పన- అంటే ప్రతి ఫాంటసీ, ప్రతి ఫెయిరీటేల్- సైన్సు ఫిక్షన్ కానేరదు. వాయువ్యాస్త్రాలు, వారుణాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాల ప్రసక్తి భారత రామాయణాది ఇతిహాసాలలో వస్తుంది. పూర్వ సాహిత్యం నిండా అణిమాది అష్టసిద్ధులు, మంత్రాలు, తంత్రాలు, మహిమలు తటస్థపడతాయి. ఆకాశయానం, కామరూపం (స్టీవెన్స్వన్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్లో లాగా) లాంటివి వుంటాయి.