Chera ( 4 sets)

Editor · Literature

Chera ( 4 sets) book cover

Price: Rs. 1500. ఒక రచయితను సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి వారి రచనలన్నీ చదవటం ఉపయోగం." అంటాడు చేరా 'ఒకే ఇద్దరము' (కేతవరపు రామకోటి శాస్త్రి) పుస్తకానికి రాసిన ముందుమాటలో. ఈ విషయం చేరాకి కూడా బాగా వర్తిస్తుంది. చేకూరి రామారావు తెలుగు సాహిత్యలోకంలో 'చేరా'గా ప్రసిద్ధి. తెలుగు సాహిత్యంలో ఛందస్సు, వ్యాకరణం, విమర్శ, కవిత్వరంగాల్లో కృషిచేసిన అరుదైన భాషాశాస్త్రవేత్త చేరా. అధ్యాపకత్వం, పరిశోధన, దూరవిద్య పాఠ్యాంశ రూపకల్పనలతోబాటు ఇన్ని రంగాలలో కృషిచేసిన ఏకైక వ్యక్తి చేరా. చేరా తన రచనలన్నీ భద్రంగా దాచిపెట్టలేదు. కనీసం వాటి సమాచారమంతా కూడా పూర్తిగా ఒకచోట దొరకదు, లేదు. వచన కవిత్వ లక్షణ సూత్రీకరణకోసం, వచనంకోసం, వ్యావహారికభాషకోసం, వ్యాకరణంకోసం, పద్యంకోసం, మార్పిస్టులదృష్టి విస్తృతికోసం, స్త్రీ చైతన్యంకోసం, ప్రత్యామ్నాయ ఆలోచనకోసం, వారవివార పడ్డాడు. నిలబడ్డాడు. ఈ నూటయాభయ్యేళ్ళ తెలుగు విమర్శరంగంలో చేరామార్గం భిన్నమైంది. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉండీ చేరా రచనల్లోని కొన్ని పార్శ్వాలే తెలుసున్న అతరానికీ, చేరా తెలుగు వాక్యకారుడుగానే తెలిసిన ఈతరానికీ చేరాలోని విభిన్నకోణాల్నేకాక, ప్రజ్ఞావంతుడైన తెలుగు భాషావేత్త బహుముఖ కోణాల్ని ఈ సర్వలభ్య రచనలు పరిచయం చేస్తుంది. భాషాసాహిత్య అవగాహనని విస్తృతపరుస్తుంది

Browse more Telugu books