Chengalva Poodanda
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 70. ఓ చురుకైన పల్లెటూరి అమాయకుడైన యువకుడు అన్యాయంగా, అక్రమంగా సమాజంలోని దుష్టశక్తుల కుట్రకు బలై జైలుపాలయ్యాడు. ఏ కారణంచేత ఎవరెవరు ఎలా వచ్చి చేరినా జైలే అన్ని విప్లవోద్యమాలకు పాఠశాల. అక్కడే ఓ మహోన్నత విప్లవమూర్తి తారసపడి సమాజం గురించి విప్లవాల గురించి సమగ్రంగా నూరిపోసి అతడ్ని చైతన్యవంతుణ్ని చేశాడు. తరువాత జైలు నుంచి విడుదలయి వచ్చాక, తన వ్యక్తిగత కక్షసాధింపులో తాను లౌకికంగా విజయం పొందినా- అది ఎంత అల్పాతి అల్ప విషయమో గ్రహించి, గురువు బోధ గుర్తుకువచ్చి- సంపూర్ణ విప్లవంపైపు నరసింహావతారుడై, కొండల్లోకి నడిచివెళ్ళిన ఒ ఉదయభాస్కరుని ఉగ్రచరిత్ర ఈ 'చెంగల్వ పూదండ' ఇంటిల్లిపాదీ చదవదగ్గ పుస్తకం!