Chematachekkina Vaakyam
Kengara Mohan / కెంగార మోహన్ · Literature

Price: Rs. 315. అక్షరాల్ని మాత్రమే కాదు, వాటి వెనక వుండే ఆవేదనల్ని ప్రేమిస్తాడు మోహన్. అందుకే, అతని కవిత్వ విమర్శలో మనసూ ఆలోచనా రెండూ కలిసి ప్రయాణం చేస్తాయి. వర్తమాన కవిత్వాన్ని సహృదయంతో గమనిస్తూ, ఎప్పటికప్పుడు సహప్రయాణం చేస్తున్నాడు మోహన్. అదే సమయంలో కవిత్వాన్ని సమతూకం వేయగలిగిన ప్రతిభకూడా సాధించుకున్నాడు. ఈ పుస్తకంలో మోహన్. పరిచయం చేసి, విశ్లేషించిన ప్రతి కవిత్వ సంపుటీ అతని విశ్లేషణ వల్ల ఇంకొక పదునైన వాక్యంగా మనకి కనిపిస్తుంది. అన్నిటికీ మించి, మోహన్ దృక్పథం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఆ దృక్పథమే ఈ పుస్తకానికి "చెమట చెక్కిన వాక్యం" అనే శీర్షికని తలమానికంగా ఇచ్చింది. ఈ కాలం కవిత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే పాత/కొత్త తరం వాళ్ళకి కూడా ఇది అవసరమైన పాఠ్య పుస్తకం!