Chatrapati Shahu Maharaj

Editor · History

Chatrapati Shahu Maharaj book cover

Price: Rs. 115. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది ఛత్రపతి సాహు మహారాజ్ జీవిత చరిత్ర భారతదేశాన్ని బ్రిటీషువారు పాలించిన కాలంలో 550 వరకు రాజ సంస్థానాలుండేవి. అందులో ఒకటి ఛత్రపతి శివాజీ చక్రవర్తి వారసత్వంగా వచ్చిన కొల్హాపూర్ సంస్థానం. సాహు మహారాజ్కు ఆంగ్లేయులతో విద్యాబోధన జరిగింది. మహారాజు చాలా పర్యాయాలు ఇంగ్లాండు వెళ్ళాడు. ఇంగ్లాండులోని కుల రహిత సమాజం, మహాత్మాజ్యోతి బాపూలే స్థాపించిన "సత్యశోధక సమాజ్" కార్యక్రమాలు సాహు మహారాజును చాలా ప్రభావితం చేశాయి. భారతదేశంలో బ్రిటీష్ వాళ్ళకి, ఏ హక్కులూ, సౌకర్యాలైతే వున్నాయో అవి అణగారిన ప్రజలకు వర్తించాలని తాపత్రయ పడ్డాడు. 1895 నాటి 'ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్లులోని 16వ అధికరణంలో పొందుపరిచిన భావ ప్రకటనా స్వేచ్ఛ, ఉచిత ప్రభుత్వ విద్య వంటి హక్కులతో పాటు విభిన్నమైన అనేక హక్కులు, సాహు మహారాజును ఆకర్షించాయి.

Browse more Telugu books