Chatrapathi Sahu Maharaj

Editor · History

Chatrapathi Sahu Maharaj book cover

Price: Rs. 110. విమల్ కీర్తి గారు బౌద్ధ అధ్యయన శీలిగా, విద్యావంతుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతము నాగపూర్ విశ్వవిద్యాలయంలో పాలి-ప్రాకృతి భాష విభాగాధిపతిగా వున్నారు. మహారాష్ట్రలోని బండారా జిల్లాలోని దేవరిదేవ్ గ్రామంలో 1949, ఫిబ్రవరి 5న షెడ్యూల్డ్ కులంలోని మహర్ సామాజిక వర్గంలో ఆయన జన్మించారు. 1956 నుండి బాబాసాహెబ్ డా|| అంబేడ్కర్ యొక్క ధమ్మక్రాంతితో ప్రభావితుడైన విమల్కీర్తి తండ్రి బౌద్ధమతం తీసుకొని తన కుటుంబాన్ని ఒక ఆదర్శ బౌద్ధ పరివారంగా మార్చి జీవనం కొనసాగిస్తున్నారు. విమల్కీర్తి గారు ప్రముఖ బౌద్ధాచార్యులు బదంత్ ఆనంద్ కౌశల్యాయన్తో కలసి చాలారోజులు పనిచేసారు. వారి ప్రభావంతోనే పాలీ భాష, సాహిత్యం, బౌద్ధాన్ని అధ్యయనం చేయుటలో ఆసక్తి పెరిగింది. విభిన్న పత్రికల్లో లేఖలు, నిబంధనలు మరియు పరిశోధన పత్రాలు అనేకం ప్రచురించబడ్డాయి. విమలీకీర్తి గారు రాసిన అనేక పుస్తకాలు ప్రచురణగావించబడ్డాయి. హిందీ భాషలో అంగుల్త్ (త్రైమాసిక) పత్రిక సంపాదకులుగా ఆయన ప్రసిద్దులు. ఎంతో స్ఫూర్తిదాయకమైన సంత్ గాడ్గేబాబాసాహిత్యాన్ని హిందీ భాషలోకి అనువాదం చేసిన ఘనత అతనికే దక్కుతుంది. అటువంటి పుస్తకాలలో సచిత్ర సంత్ గాడ్గేబాబా జీవనం ఒకటి. సమాంతర తరపున దీన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నందుకు గర్వంగా వుంది.

Browse more Telugu books