Changizkhan

Editor · Novels

Changizkhan book cover

Price: Rs. 320. "ఛంఘిజ్ ఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత" అన్నది జర్మన్-అమెరికన్ చరిత్రకారుల పసికరల దృష్టి. “ఛంఘిజ్ ఖాన్ నా ఆదర్శ వీరుడ"న్నది జవహర్ లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12,13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను వివేచించి సరైన అంచనా వెయ్యగల సాహితీ చరిత్రకారులకు, సామ్రాజ్యవాదాన్నీ, చుట్టుపట్ల ఉన్న దేశాల కుటిల రాజకీయాల నెదిర్చి- మంగోల్ జాతికేకాక ఆసియాఖండానికే ఉజ్జ్వల భవిష్యత్తు అందించిన వెలుగుసూర్యుడూ, మహోన్నత మానవతావాదీ ఛంఘిజ్భాన్, "మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయించేది శత్రువు చేతిలోని ఆయుధమే" అన్న సూక్తే ఛంఘిజ్ఫాన్ చండశాసనపరత్వానికి కారణభూతం కావచ్చు. తెన్నేటి సూరి, తననాటికున్న వివిధ గ్రంథాల నాధారంగా చేసిన సాధికారిక రచన ఇది. ఎంతో నైపుణ్యంతో చరిత్రను కాల్పనిక కావ్యంగా తీర్చిదిద్దిన సందర్భం ఇది. భారతి, ఆంధ్రపత్రికలలో 1945-1957లలో పత్రికారచయితగా పనిచేశారు. “విప్లవరేఖలు”, “సుబ్బలక్ష్మి” కథల సంపుట లనూ, “అరుణరేఖలు”, “మహోదయం" కవితాసంకలనాలనూ, "నా రాణి" నాటికనూ ప్రచురి ంచారు. వీరి రచనలలో "సాహిత్య సమవాకారము” చక్కని వ్యంగ్యరచన. “రెండు మహానగరాలు” మంచి స్వేచ్ఛానువాద నవల. అంతర్జాతీయ కథానికల పోటీలో (1954) వీరి "భారతి" కథకి పురస్కారం వచ్చింది.

Browse more Telugu books