"Chandrudu Undadu! Thaaralu Undavu Kaani, Nenu Eppudu Nee Danniga Untanu!

Ranganayakamma / రంగనాయకమ్మ · Novels

"Chandrudu Undadu! Thaaralu Undavu Kaani, Nenu Eppudu Nee Danniga Untanu! book cover

Price: Rs. 75. “న యే చాంద్ హోగా, న తారే రహేంగే, మగర్, హమ్ హమేషా తుమ్హారే రహేంగే! నేను నీ దాన్నిగా ఎల్లప్పుడూ వుంటాను' అని వాగ్దానాలు చెయ్యడం మాత్రం ప్రార్ధన వంటిది కాదా? నా ప్రేమ', 'ఎల్ల కాలం వుంటుంది' అని నోటి మాటలతో చెప్పాలా? తన ప్రవర్తన లోనే అది వుండాలి. ఆ పాట గొప్పదే. కానీ, ఆలోచిస్తే, ఈ ప్రశ్నలన్నీ వస్తాయండీ.” "మీరెలా తెస్తారు? ఆ అమ్మాయి ఒంటి మీద ఒక్క నూలు పోగంత నగ వున్నా నేను భరించలేను. మీ చేతులకు గాజులున్నాయి! వుంగరాలు లేవు లెండి. దుద్దులున్నాయి, ముక్కు పుడకలు లేవు లెండి. పాపిడి పిందిరీలు ధరించలేదు, దానికి ఫర్వాలేదు మీరు. ఆ పిందిరీలు లేని అమ్మాయిని వెతక గలరా మీరు?" "అసలీ ఆడవారేమిటండీ, మీతో సహా? మొగాళ్ళ చేతులకు గాజులుండవు కదా? మన చేతులకి గాజులెందుకు అనుకోరేం? దేనికీ ప్రశ్నలు రావా? ప్రశ్నలు ఆడవాళ్ళకీ రావు, మొగాళ్ళకీ రావు! ఎందుకు రావు? ఇదో పెద్ద ప్రశ్న నాకు!" "దొరకరని ఎప్పుడో తెలుసు నాకు. దొరకడం కోసం నేను ఎవ్వర్నీ వెతకడం లేదు. 'నగల' అయిష్టమే కాదు నాకు. అందాల మూర్ఖత్వాన్ని కూడా భరించలేను నేను! సహజత్వాలే, ఆ ఆలోచనలే, కావాలి నాకు. నా ఆలోచనల ప్రకారమే ఒక అమ్మాయి నడవాలి అంటున్నానా నేను? నా విమర్శలు నావి. భక్తురాళ్ళు, దేవుళ్ళ గుళ్ళల్లో జుట్లు గొరిగించు కుంటారు. దేవుళ్ళకి డబ్బెందుకు? జుట్లెందుకు? అని ఒక్క క్షణం అయినా ఆలోచిస్తారా? ఆ గొరిగించుకున్న వేలాది మంది జుట్లు, భారీ భారీ సవరాలుగా మారి, సరుకులై పోతే, వాటిని బేరాలతో కొని, వాటిని తమ నిజం జుట్లుకి జత చేసుకుని, ఆ కుప్ప కుప్పల జుట్టు పోగులతో మొహాల్ని నింపు కోవడమే అందాలకు మార్గం అవి, అందాల వారి అభిరుచులు!

Browse more Telugu books