Chakkani Pillalaku Enchakkani Neethi Kathalu
D.V.V.S. Narayana / డి.వి.వి.యస్ . నారాయణ · Children's Books

Price: Rs. 45. చదువు, క్రమశిక్షణ పిల్లలకు భారంగానే వుంటాయి. నాకూ అందరిలాగే మొదట్లో అనిపించినా, తర్వాత నాన్నగారి పెంపకంలో మంచిగా భావించాను. నాకు ఆయన తండ్రి. నాకు చక్కని వ్యక్తిత్వాన్ని నేర్పడంలో ఆయన చాలా బాధ్యత నిర్వర్తించారు. ఆయన నాకు గురువు. సులువుగా, అర్థంచేసుకుని చదవడం ఆయన దగ్గరనే నేను నేర్చుకున్నాను. చదువుకి వయసు అడ్డుకాదు ! గెలుపుకి కుటుంబ బాధ్యతలు అడ్డంకావు!! అని నిరూపించారు నాన్నగారు. రెండు డిగ్రీలు, రెండు పి.జి.లు చేసి చదువు విలువను మాకు చెప్పారాయన. స్త్రీ సమానత్వం మాటల్లోనే కాదు ఆచరణలో చూపించిన నాన్నగార్ని చూసి నేనెంతో గర్వపడతాను. రచయితగా, గాయకునిగా, అధ్యాపకునిగా ఆయన నాలాంటి ఎందరినో చైతన్యవంతుల్ని చేశారు. అలాగే నాన్న చేస్తున్న ప్రతి పని వెనుక మా అమ్మ అలివేలు పాత్ర చాలా వుంది. నాన్న రచనలకి మొదటి పాఠకురాలు అమ్మ. నాన్న పాటలకి మొదటి శ్రోత అమ్మ. నాన్న చేసే కార్యక్రమాలకు కూడా ఉండి చూసుకొనేది మా అన్ము! అందుకే అమ్మ నాన్నలంటే నాకు ప్రత్యేక గౌరవం! నాన్నగారి రచనలకి నేను అభిమానిని. ఆయనే నాకు స్ఫూర్తిదాయకం. నాన్న రచనలని వెలుగులోకి తెస్తున్న జె.పి. ప్రసాద్ అంకుల్కు నా కృతజ్ఞతలు! 'కష్టేఫలి' అని నిరూపించిన ఈ ఇద్దర్నీ నేను ఎప్పటికీ గౌరవిస్తాను.