Chaina Pi Arunathara

Editor · Best Selling

Chaina Pi Arunathara book cover

Price: Rs. 135. కామ్రేడ్స్ మావో, చూటే, చౌ.ఎన్. లైల నాయకత్వాన 6 వేల మైళ్ల "లాంగ్ మార్చ్”ని ఎర్రసేన తలపెట్టింది. దక్షిణాది నుండి ఉత్తరాదికి మూడు లక్షల మంది సేన ఆబాల గోపాలంతో సహా తరలిపోయిన యాత్ర ఇది. మంచు కొండలను నదీ నదాలను, చలిని, ఎండను, వానను సరకు చేయకుండా ఎక్కుతూ దిగుతూ పడుతూ లేస్తూ సాగించిన ప్రయాణం ఇది. ఇందుకు తోడు పదే పదే ఉప్పెన తెరలుగా వచ్చి తాకిన చియాంగ్ కై షేక్ (కొమింగ్జాంగ్) సైనిక దాడులను త్రిప్పికొడుతూ కొనసాగించిన జైత్రయాత్ర ఇది. ఆకలిదప్పులకు, జబ్బులకు పస్తులకు, శత్రుసేనల కాల్పులకూ ఆప్తులూ వేలాది సైనికులు నేలకొరగగా మూడు లక్షలుగా బయలుదేరి ముప్పయివేల మందితో ఎర్రసేన యేనాన్కు చేరిన వైనం ఇది. ఆ మహాప్రస్థానానికి సాహసించి, సారధ్యం వహించిన యోధుల, మహాయోధుల వీరోచితగాథలను, జీవిత విశేషాలను, వారితో ఇంటర్వ్యూ చేసి ఎడ్గార్స్న సమీకరించిన సమాచార దీపిక “చైనాపై అరుణతార".

Browse more Telugu books