Cartoonlo Marx
Editor · Politics

Price: Rs. 95. కార్టూన్లలో మార్క్స్ రచనలను, సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించాడు 'రీయుస్! ఈ పుస్తకం ఒక 'డైజస్ట్!... మార్క్సిస్ట్ సిద్ధాంతమూ, దాని చరిత్రా: ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ, వర్గ వైరుధ్యం, వర్గ పోరాటం, సోషలిజం విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేట్టు విడమరచే మార్క్సిస్ట్ సిద్ధాంత సంగ్రహ దర్పణం!... మార్క్స్ జీవిత చరిత్రను కూడా విపులీకరించే బొమ్మల కథ. రీయుస్ (1934-2017) అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మెక్సికన్ కార్టూనిస్ట్. ఎడువార్డో డెల్ రియో ఈయన పూర్తి పేరు. 1982 జూన్లో మేం వెలువరించిన ఈ పుస్తకం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సంక్లిష్టమైన విషయాన్ని కూడా సులభంగా చెప్పే ఈ పుస్తకానికి ఇప్పటికీ వన్నె తగ్గలేదు. అందుకే ఈ రష్యన్ విప్లవ శతాబ్ది వత్సరంలో దీన్ని పునర్ముద్రించి మీ ముందుకు తెస్తున్నాం.