BUJJI KUDELU DHAIRYAM

Editor · Best Selling

BUJJI KUDELU DHAIRYAM book cover

Price: Rs. 265. జంతువుల ఇతివృత్తాలతో 'పంచతంత్రం' లాగా సాగిపోతాయి ఈ కథలన్నీ. మానవజాతిలో ఉన్న సమస్త లక్షణాలను జంతువులకు ఆపాదిస్తూ నడిచే ఈ కథలు ఎంతో ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి కథలోను ఒక నీతి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రయోజనకర అంశాల ప్రాముఖ్యతనూ ఈ కథలు చెబుతాయి. పాత్రలు సాహసాన్ని, సమయస్ఫూర్తిని, సమస్యను పరిష్కరించే విజ్ఞతను ప్రదర్శిస్తాయి. అదే సమయంలో కుటిలత్వంతో, జిత్తులమారితనంతో వ్యవహరించే పాత్రలూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే యుక్తిని ప్రదర్శించే పాత్రలూ ఉంటాయి. అందమైన బొమ్మలతో ఆకట్టుకునే ఈ కథలను బాలలు చదవడం మొదలుపెడితే చివరివరకు ఆపకపోవడమే కాదు, పదేపదే మళ్ళీమళ్లీ చదువుతూనే ఉంటారు, ఆస్వాదిస్తూనే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య కరీంనగర్ జిల్లా, ధర్మపురి నివాసి. విశ్రాంత ఉపాధ్యాయుడు. బాలల కథలంటే అమితంగా ఇష్టపడే రామకృష్ణయ్య చందమామ, బాలమిత్రల స్ఫూర్తితో తానూ కథలు రాయడం ఆరంభించారు. బాలల్లో మార్పు తీసుకురావడానికి కథలు అత్యంత శక్తివంతమైన సాధనాలుగా భావించిన ఈయన అందుకు తగినట్లుగా కథలు రాశారు. 2001లో బాలల కథలు రాయడం మొదలు పెట్టి ఇప్పటివరకు వందల సంఖ్యలో కథలు రాశారు, అవి ప్రసిద్ధ దిన, వార, పక్ష, మాస పత్రికల్లో ప్రచురించబడుతున్నాయి. ప్రతిరోజు వారి కథ ఏదో ఒక పత్రికలో ప్రచురించబడకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. వీరి కథలు పలు పుస్తకాలుగా కూడా వెలువడినాయి. 2019లో రంగినేని ట్రస్ట్, సిరిసిల్ల వారి పురస్కార సత్కారం మొదలుకొని ఇప్పటివరకు పలు సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వారిని సత్కరించాయి. 2011లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా పొందారు.

Browse more Telugu books