Budduni Dharmopadesham
Editor · History

Price: Rs. 180. బుద్దుని ధర్మోపదేశం అనే ఈ అనువాద గ్రంథానికి మూలం పాల్కారస్ (paul carus) 1894 The Gospel of Buddha. ໑໖ అనేక ముద్రణలకు నోచుకొన్న దంటేనే దీని ప్రశస్తి గురించి చెప్పపని లేదు. ఇది బౌద్ధదేశాలైన జపాన్ శ్రీలంకలలోని బడులలోకి, గుడులలోకి ఆధికారిక ప్రవేశం చేసిందంటే దీని ప్రామాణికత ఏమిటో తెలిసిపోతుంది. బౌద్ధం శాఖోపశాఖలుగా చీలి, వివిధ దేశాలలో వివిధ సమయాలు (schools)గ అలరారుతున్నా పాల్మాత్రం ఏశాఖకు అంట కాగ కుండ, మూల బౌద్ధానికే విశ్వాసి అయి, అనన్యమైన బుద్ధుని మూర్తిమత్వానికి కావ్యశోభను చేకూర్చాడు. 12, 13 శతాబ్దాల అనంతరం భారతదేశంలో బౌద్ధం కనుమరుగైనా, ఆ తరవాత ఇటీవల అనగారిక ధర్మపాల, బాబాసాహెబ్ అంబేడ్కర్లు రంగప్రవేశం చేయడంతో, అది పునరుత్థాన మవుతోంది. అయితే పాశ్చాత్య దేశాలలో అంతకు ముందెన్నడూ బౌద్ధం మాట వినపడకపోయినా, బీల్, బిగాన్లెట్, బుహ్లెర్, బర్నౌఫ్, చైల్డర్స్, అలెగ్జాండర్ జోమా (csoma), రైస్ విడ్స్, డ్యుటోయిట్, ఐటెల్, ఫోకా (Fowcanx) ఎడ్మండ్ హార్డీ, స్పెన్స్ హర్డీ, హోడ్గసన్, చార్లెస్ R. లాన్మన్, F మాక్స్ ములర్, కారల్ యూజెన్ న్యూమన్, ఓల్డెన్ బర్గ్, పైశ్చల్, సెపైనర్, సెనార్ట్, సెయిడెన్స్ టకర్, భిక్టు జ్ఞాన తిలోక, D.M. స్ట్రాంగ్, H.C. వారెన్, వస్సిజ్యూ, వెబెర్, విండిన్చ్, వింటర్నిట్జ్ మొదలైన వారెందరో బౌద్ధ మూలగ్రంథాలను అనువదించి బౌద్ధాన్ని పాశ్చాత్య లోకానికి పరిచయం చేశారు. ఈ కోవకు చెందిన వాడే పాల్ కారస్, వీరిని అనుసరించి మూలాను వాదాలను కొంతమేర గ్రహించాడు. కొన్ని చోట్ల ఈతడు, కావ్య శోభ కోసం మూలాలకు మార్పులు చేర్పులు చేసినా, వీటికి మూల రూపాలు మూల బౌద్ధంతో లే కుండ లేవు. బుద్ధుడు చెప్పిన అనాత్మ (nosoul)ను అర్థంచేసుకోని వానికి బౌద్దం అర్దం కానట్లే