Buddhudu! Karlmarx!! series 14

Editor · History

Buddhudu! Karlmarx!! series 14 book cover

Price: Rs. 45. కార్ల్ మార్క్స్ - బుద్దుడి మధ్య పోలిక హాస్యాస్పదం అనిపించవచ్చు. అలా అనుకోవడంలో పెద్దగా ఆశ్చర్యం కూడా లేదు. మార్క్స్ కి బుధుడికి మధ్య సరిగ్గా 2,381 సంవత్సరాల ఎడం ఉంది మరి! బుద్ధుడి జననం క్రీస్తుపూర్వం 563 వ సంవత్సరం లో జరిగితే, మార్క్స్ క్రీస్తు శకం 1818 లో పుట్టాడు. కార్ల్ మార్క్స్ ని ఒక కొత్త రాజకీయ ఆదర్శం, ఆర్థిక వ్యవస్థ ల నిర్మాత గా భావిస్తే; బుధ్ధుడు రాజకీయాలతో గానీ, ఆర్ధ శాస్త్రం తో గానీ ఏ సంబంధమూ లేని వ్యక్తి. ఆయన ఒక కొత్త మత సృష్టికర్తగా ఘనత వహించినవాడు. అందువల్లే సుదూర కాలాంతరాలలో జన్మించిన, ఏ సంబంధమూ లేని రంగాలకు చెందిన ఈ ఇద్దరి మధ్య పోలిక గానీ, భేదాలను గానీ చర్చించే ఈ వ్యాసం శీర్షిక - “బుద్ధుడా? లేక కార్ల్ మార్కా” విచిత్రంగానే తోస్తుంది. మార్క్సిస్టు లైతే బుద్ధుడి తో మార్క్స్ ను సమాన స్థాయి లో చర్చించడాన్ని వెక్కిరించవచ్చు, లేదా చిన్న నవ్వుతో కొట్టిపారేయనూ వచ్చు. ఎక్కడి అధునాతన మార్క్స్! ఎక్కడి పురాతన బుధుడు! మార్క్సిస్టుల దృష్టిలో తమ గురువు తో పోలిస్తే బుద్దుడు కేవలం ఆది మానవుడిలా అనిపించవచ్చు. ఇలాంటి ఇద్దరు మనుషుల మధ్య ఎలాంటి పోలిక చెప్పవచ్చు? అసలు మార్క్సిస్టులు బుద్దుడి నుండి ఏం నేర్చుకోవచ్చు? లేదా బుధ్ధుడు ఒక మార్క్సిస్టులకు ఎలాంటి బోధన చేయగలడు? దీన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఈ ఇద్దరి మధ్య పోలిక భలే ఆసక్తికరంగా, తప్పక కొత్త విషయాలను బోధించగలదని అనిపించే విధంగా ఉంది కదూ! ఈ ఇద్దరి బోధనలను చదివిన వ్యక్తిగా, ఇద్దరి భావజాలాలనూ ఆసక్తిగా గమనించిన వ్యక్తిగా వీళ్ళ మధ్యపోలికలు, అంతరాలను తరచి చూడటం నాకు తప్పట్లేదు. మార్క్సిస్టులు కూడా తమ పక్షపాతాలను పక్కన పెట్టి, బుద్దుడిని మళ్ళీ చదివితే, ఆయన సిద్ధాంతాలను కొత్త దృష్టితో చూసి, తమ దృక్పధాలను తప్పక సవరించుకుంటారని నా నమ్మకం. బుధ్ధుడిని నిరాకరించాలనే నిశ్చయించుకుని ఉంటే బుద్ధుడితో పాటు ప్రార్థనకైతే కూర్చోవడం జరుగదు కదా మరి!

Browse more Telugu books