Buchhibabu-Bommacaru, Chinnari Geyalu, Pitta Pitta

Editor · Children's Books

Buchhibabu-Bommacaru, Chinnari Geyalu, Pitta Pitta book cover

Price: Rs. 45. బడిలో అప్పుడే చేరిన వాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా పుస్తకాలు చదవగలరా? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా పుస్తకాలు రాస్తారా? ఇప్పుడివన్నీ అర్థంలేని ప్రశ్నలు. పిల్లలు చదవడం పలు రూపాల్లో వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు పలకల్ని, బలపాల్ని అరగదియ్యపన్లేదు. గుడ్డి కంఠస్తాలు, ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. అసలు మనం నెత్తి మీద కూచుని భాష నేర్పనక్కరలేదు. ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు భాష నేర్చుకోడానికి ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు నాలుగు గ్రేడ్ల, 50 పుస్తకాల సీరీస్లోవి. ఇది 1-2 తరగతుల పిల్లలకోసం.

Browse more Telugu books