Brahmaneekam

Editor · Novels

Brahmaneekam book cover

Price: Rs. 90. “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంగారిది. తనను తాను అన్వేషించుకుంటూ ఒకవ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండాతన ప్రయాణాన్నంతారచనల్లో కూర్చినవ్యక్తి.” చలం 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలువచ్చాయి. 1979మే 4నకనుమూశారు. +++ 1937లో వ్రాసిన నవల బ్రాహ్మణీకం. తీగకు ప్రాకటంలాగా స్త్రీ కి ప్రేమించడం, జాలి పడటం సహజ గుణాలు. నిష్టాగరిష్టమైన సంప్రదాయ శిక్షణ కూడా ఆమె జాలి గుణం ముందు ఓడిపోతుంది, అని నవల పేరు సూచిస్తుంది. ఆ జాలి ప్రేమల వల్లనే ఆమె మనసు బలహీన పడుతుంది. తన ప్రేమను సుప్రతిష్టితం చేసుకోవడం కోసం ఒక బిడ్డను కనాలి, రక్షించుకోవడం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడాలి. ఈ గొప్ప గుణాల వల్లనే స్త్రీకి కష్టాలు. వాటివల్ల సమాజనీతి భంగానికీ సిద్ధం అవుతుంది. అది ఆమెకు పవిత్రతనే పెంచుతుంది కానీ, దోషం ఆపాదించదు.. అని నవల ముగింపు సూచిస్తుంది.

Browse more Telugu books