Botanical Zoo
Dr. Kandepi Rani Prasad / డా॥కందేపి రాణీప్రసాద్ · Books

Price: Rs. 108. డా॥ కందేపి రాణీప్రసాద్ గారి 'బొటానికల్ జూ' 33వ బాల సాహిత్య గ్రంథం. ఎనిమిది అనువాద గ్రంథాలు, నాలుగు సంపాదకత్వ పుస్తకాలు, 20 బాల సాహిత్య గ్రంథాలు రాశారు. వెజిటబుల్ కార్వింగ్ అనే కళా ప్రక్రియలో సైన్స్న మిళితం చేసి బాలల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ 'బొటానికల్ జూ' ని. బాలల కొరకు ఆసుపత్రి వ్యర్థ పదార్థాలతో టీచింగ్ ఎయిడ్సు తయారు చేసి సృజన్ పిల్లల ఆసుపత్రి మ్యూజియంలో ఉంచారు. ఆసుపత్రికి వచ్చే చిన్నారి రోగుల స్వాంతనకై స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. నిత్యం నూతన ప్రయోగాలు చేస్తూ సాహిత్య, కళా రంగాలలో కొత్త ఒరవడుల్ని సృష్టిస్తున్నారు. సృజన్ పిల్లల ఆసుపత్రి యొక్క ప్రిస్క్రిప్షన్ చీటీపై బాలల గేయాల్ని గత పది సంవత్సరాల నుంచీ ప్రచురిస్తూ తెలుగు భాషను ప్రచారం చేస్తున్నారు. దీనిని ఈటీవి, ఈటీవీ2, జెమిని, ఎన్టిటివీ, టీవీ 9, ఆర్ టివీ, యాదగిరి టీవీ చానళ్ళలో ఇంటర్వ్యూల ద్వారా ప్రచారం చేశారు. సింగపూర్, బొంబాయి, ఒరిస్సాలలో తమ కళా ప్రదర్శనలు నిర్వహించారు. మెడికల్ ముగ్గులు, సందేశాత్మక రంగవల్లుల ద్వారా మహిళల్లో వైద్యం పట్ల, సామాజిక సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తున్నారు. ఆకులు, కాయలు, పూలు, పండ్లు, కొమ్మలు, ఎండుపుల్లలు వంటి అన్నిరకాల చెట్ల ఉత్పత్తులతోనూ రకరకాల బొమ్మలను సృష్టించి వరల్డ్ రికార్డులను సాధించారు. "కళాభారతి, బాల సాహితీ కౌముది, బాల సాహితీ పూర్ణిమ, కవితా రాణి" అనే బిరుదాల్ని తమ బాల సాహిత్యానికి పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య కీర్తి పురస్కార ప్రదాతలు డా॥ కందేపి ప్రసాదరావు, రాణీప్రసాద్ దంపతులు.