BOSE
Editor · History

Price: Rs. 200. స్వేచ్ఛను ఎవరూ ఇవ్వరు.. దాన్ని మనమే తీసుకోవాలి. * ఒక గొప్ప ఆదర్శం కోసం ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ అతని మరణం తర్వాత ఆ ఆదర్శం వెయ్యి మందిలో జీవం పోసుకుంటుంది. * చరిత్రలో ఏ నిజమైన మార్పూ.. ఏనాడూ చర్చల ద్వారా లభించలేదు. - సుభాష్ చంద్రబోస్ "సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ప్రదర్శించిన దృఢ సంకల్పం చూస్తే.. సామ్రాజ్యవాద శక్తులు తమ యుక్తులన్నింటినీ ఉపయోగించినా కూడా పౌరుల స్వాతంత్య్ర స్ఫూర్తిని అణచివేయలేవని అర్థమవుతుంది" - ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు "బోస్ ఒక శక్తివంతమైన ప్రత్యర్థి. ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మేం చెప్పుకోలేనంత సంకటపరిస్థితిని తెచ్చి పెట్టింది" - ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ మోంట్రోమెరీ, బ్రిటిష్ సైనిక నాయకుడు "సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఐఎన్ఏల కథ.. బ్రిటిష్ పాలకుల మనోధైర్యాన్ని కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. దాన్ని తక్కువగా అంచనా వేయలేము." -లార్డ్ మౌంట్‌బాటన్, భారతదేశ చివరి వైస్రాయ్ "సుభాష్ సింహం లాంటి వాడు. స్వరాజ్య సమరంలో ఆయన నాయకత్వం, ఆయన చేసిన త్యాగం రానున్న ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది." - సర్దార్ వల్లభాయ్ పటేల్ “సుభాష్ చంద్రబోస్ కేవలం మాటల మనిషి కాదు. చేతల మనిషి. స్వరాజ్య సమరంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఆయనను ఒక విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి.” - మహమ్మద్ అలీ జిన్నా "సుభాష్ అంటే ఒక జాతి ఆత్మను మేల్కొల్పిన ప్రభంజనం. ఆయన పడిన తపనే మన స్వాతంత్ర్యానికి జీవనాడి” -రవీంద్రనాథ్ ఠాగూర్