Biddala shikshana
Editor · Literature

Price: Rs. 145. “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. +++ “చలంగారు నిజజీవితంలో ప్రధానంగా స్త్రీల కోసం, బిడ్డలకోసం పోరాడారు. కానీ స్త్రీల విషయమే అధికంగా వారి సాహిత్యంలో వస్తుంది. తన సంతాన పోషణ, శిక్షణల్లో స్వయంగా శ్రద్ధ వహించి ఆ అనుభవంతోనే ఈ పుస్తకం వ్రాశారు. "... బిడ్డల్ని హింసపెట్టకుండా వాళ్ల చేత మీరు హింసపడకుండా ఉండే మార్గాన్ని చూపటానికే వ్రాశా..." అన్నారు. "ఇంతకాలం బిడ్డలు, తల్లిదండ్రులకై త్యాగాలు చెయ్యాలని బోధించారు. ఇది అక్రమమనీ, పెద్దవారే బిడ్డలకై త్యాగం చెయ్యవలసిన విధి అని నేను ఈనాడు బోధిస్తున్నాను...” అన్నారు. నేడు బిడ్డల మీద శ్రద్ధ - త్యాగం వచ్చిన మాట నిజమే. కాని ఈ శ్రద్ధా, త్యాగం పెట్టుబడిలాటివి. నేటి బిడ్డలకు స్వేచ్ఛ యిచ్చే దృష్టి చలానిది.