Bhrathadheshamlo Prajaarogyam

Editor · Cinima

Bhrathadheshamlo Prajaarogyam book cover

Price: Rs. 15. ప్రపంచంలో పుట్టిన ఐదేళ్లలోపు మరణిస్తున్న శిశువుల్లో అయిదో వంతు మంది భారత దేశంలోనే ఉన్నారంటే మన ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో చెప్పక చెబుతుంది. అదే విధంగా పిల్లలను కనేటప్పుడు మరణిస్తున్న తల్లుల్లో అత్యధికులు భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మానవ వనరుల అభివృద్ధి సూచీలో 169 దేశాలలో మన దేశం 119వ స్థానంలో ఉంది. మన రాజకీయ విధానాలు ఆరోగ్య రంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశాయో ఈ చిన్న పుస్తకం తెలియజేస్తుంది. రాజ్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతల నుండి తప్పుకుని మార్కెట్ శక్తులకు దాన్ని వదిలిపెట్టడం వల్ల పరిస్థితి మరింత విషమించింది. వివక్ష, నిర్లక్ష్యం తీవ్రంగా పెరిగాయి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ రంగంలో కొన్ని కీలకమైన సమస్యలను, కీలకమైన డిమాండ్లను గురించి ఇది విశదీకరిస్తుంది. అందరి దేశం మన దేశం (సబ్కా దేశ్ హమారా దేశ్) కార్యక్రమంలో భాగంగా అఖిల భారత ప్రజా సైన్సు ఉద్యమం (ఎఐపిఎస్ఎన్) తీసుకువస్తున్న పుస్తక పరంపరలో ఈ చిరుపుస్తకం ఒకటి. భారతదేశంలో విభిన్న భావపరంపరలను కాపాడేందుకు కృషి చేసేవారందరితో కలిసి పనిచేయడానికి ప్రజా సైన్సు ఉద్యమం చేస్తున్న ప్రయత్నంలో ఈ కార్యక్రమం ఒక భాగం. జాతి పురోభివృద్ధి కోసం సామాజిక కృషి చేయడం, ప్రజాజీవితాలను మెరుగుపరచడం దీని లక్ష్యం.

Browse more Telugu books