Bhinnatwamlo yekatwam manava vadam

Editor · Best Selling

Bhinnatwamlo yekatwam manava vadam book cover

Price: Rs. 170. మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడాల్సిందే!! తప్పదు- వస్తువులైనా, మనుపులైనా, కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్న వారిని, పైకి లేచిన వారినీ- పైకి లేని కింద పడినవారిని-అందరినీ. ప్రపంచంలోని అన్యాయాన్నిచూస్తూ ఉండకూడదు. అది మన వెలుగుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకోగూడదు. సహించగూడదు. ఆ లక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక పాక్ష్యం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి మనిషిని మనిషి దేశాన్ని ఇంకో దేశం దోచే విధానం అంతం కావాలి. సామ్రాజ్యవాదం పేర చెలాయిస్తున్న పెత్తనాన్ని అంతం చేయనిదే... మానవ జాతి అనుభవిస్తున్న బాధలు, దోపిడీ నివారించబడవు. దాన్ని అంతం చేయకుండా యుద్ధాలు వద్దని, శాంతి కావాలని చెప్పే కబుర్లు బట్టి నయవంచన. విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత డాక్టర్ దేవరాజు మహారాజుగారు గత యాభై అయిదేళ్లకు పైగా రచనలు ప్రకటిస్తూనే ఉన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో ఎన బై ఏడు ప్రామాణిక గ్రంథాలను వెలువరించిన ఈ సాహితీవేత్త, ఐదు జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. అందులో ఒకటి వైజ్ఞానిక రచనలకు స్వీకరించింది కూడా ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిన నేను అంటే ఎవరు?- అనే నవన కూడా వైజ్ఞానిక రచనే సమాజంలో హేతుబద్ధత పెంచాలని, సామాన్యుడిలో వైజ్ఞానిక స్పృహ పెరగాలని తపిస్తూ నిరంతరం తన కలం కొనూ రుశపిస్తున్న నిశ్యకృషీవలుడు. ఆ కోవలో రచించిందే ఈ రచన! అదే ఈ ప్రచురణ!!

Browse more Telugu books