Bharistar parvathisham

Editor · Best Selling

Bharistar parvathisham book cover

Price: Rs. 818. బారిష్టర్ పార్వతీశం ! ఏముంటుంది ఈ నవలలో? ఒక బారిస్టర్ గారు, ఆయన వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఒడిదుడుకులు, అంతకంటే ఏముంటుంది? అదే వృత్తిలో ఉన్న వాళ్లకు కొంత ఆసక్తి ఉండవచ్చు! మరి ఇతరుల మాటేంటి? నవల చదవకుండా పేరు వినగానే మనసులో మెదిలే భావాలు ఇవి! కానీ చదివిన తర్వాత ఒకనాటి ప్రాక్పశ్చిమ సమాజాలు రెండూ స్పష్టంగా కళ్ళ ముందు కదలాడుతాయి. నవల పూర్తి అయ్యే సమయానికి అమాయకత్వం, అజ్ఞానంతో ప్రారంభమైన ఒక సగటు పల్లెటూరి పిల్లవాడి జీవగమనం. జిజ్ఞాస మార్గంపై కొనసాగి జ్ఞాన గమ్యాన్ని చేరుకుంటుంది. తెలుగు రచనకు శ్రుతి మించని హాస్యాన్ని పరిచయం చేస్తూ సగటు పాఠకుడికి చక్కిలిగింతలు పెట్టిన రచన ఇది. అయితే నవలలో పైపూత హాస్యం, అంతర్గతంగా దేశభక్తి. రచయిత నవలను రెండు భాగాల్లో ముగించకుండా మూడు భాగాన్ని కొనసాగించడమే అందుకు నిదర్శనం. న్యాయవాద వృత్తిలో ఉండే చీకటి వెలుగుల్ని స్పృశిస్తూ ఆ వృత్తిని జీవనోపాధిగా కాక సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించాలో, భిన్న పరిస్థితుల్లో అవసరమైతే ఆ వృత్తిని ఎలా త్యజించాలో కూడా మార్గదర్శనం చేసింది ఈ నవల. ఇంతకూ ఇది హాస్య నవలా? చారిత్రక నవలా? సామాజిక సవలా? యాత్రా చరిత్రా? కాలక్షేపపు నవలా? వీటన్నింటి లక్షణాల్ని తనలో కలుపుకొని సమకాలీన పరిస్థితుల్ని జాతి కళ్ళ ముందు నిలిపి కర్తవ్య బోధ చేసిన బాధ్యతాయుత రచన ఇది. రచయిత వ్యక్తిగత అనుభవాలు కూడా ఈ నవలకు సహజత్వాన్ని సంతరించి పెట్టాయి. కథలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సరోజినీ నాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు, గాంధీజీల ప్రాసంగికత రచనకు ఒక విశ్వసనీయతను, ఔన్నత్యాన్ని, వాస్తవికతను తెచ్చిపెట్టింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలోని ఒక మూడు నాలుగు దశాబ్దాల సమాజిక జీవనానికి దర్పణం పట్టింది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి ఈ రచన. ఆధునిక సాహిత్యపు తొలినాళ్ళలో వచ్చిన అత్యుత్తమ నవలల్లో ఒకటి ఈ రచన.

Browse more Telugu books