Bharathadeshamlo Na Jailu Jeevitam
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 199. ఈ పుస్తకం చదవటం నాకొక గొప్ప అనుభవం. వేరొక దేశానికి చెందినామె మనదేశంలో జనం గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సాగుతున్న పోరాటాల గురించీ మనకు తెలియని విషయాలు చెపుతూ వుంటే మనకు కలిగేది ఆశ్చర్యమే అయినా, కలగవలసింది ఆశ్చర్యం కాదు. సిగ్గు! - కాళీపట్నం రామారావు అనుకోని పరిస్థితుల్లో బీహారులో జైలు జీవితం గడిపిన బ్రిటీషు పౌరురాలు మేరీ టైలర్ అనుభవాలకు అక్షరరూపమే ఈ పుస్తకం. ఐదేళ్లపాటు హజారీబాగ్ జైలులో ఆమె ఎంతోమంది ఖైదీలతో కలిసిమెలసి ఉన్నారు. ఈ సమయంలో సునిశితమైన పరిశీలనా దృష్టితో, సాటి మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసక్తులతో వారినుంచి తెలుసుకొన్న విభ్రాంతికర వాస్తవాలెన్నో ఈ పుస్తకంలో ఆమె మన కళ్ల ముందుంచారు. విస్తృతంగా పరుచుకున్న దారిద్య్రం, నిరంకుశంగా సాగిపోతున్న రాజకీయ దమనకాండల మధ్య నలిగిపోతున్న జనజీవితాల గురించీ, న్యాయ-జైళ్ల వ్యవస్థల్లో పాతుకుపోయిన అమానుష ధోరణుల గురించీ ఆమె ఆర్తితో రాసిన అనుభవాలు మనల్ని తట్టి లేపుతాయ.