Bharathadesha Charithra Adhunika yugam

Editor · Best Selling

Bharathadesha Charithra Adhunika yugam book cover

Price: Rs. 130. చరిత్ర తెలుసుకోవాలనుకునే వారికి ఆసక్తికరంగా, విపులంగా, సరళంగా భారతదేశ చరిత్రను వివరించిన గ్రంథం ఇది. ప్రాచీన, మధ్యయుగాల చరిత్రను ఇప్పటికే తీసుకువచ్చిన కె.ఎల్. కాంతారావుగారు సంభాషణ రూపంలో ఆధునిక భారత చరిత్రనూ రాశారు. 23 విభాగాలుగా వున్న ఈ రచనలో భారతదేశానికి బ్రిటిష్ వారి రాక నుండి స్వాతంత్ర్య పోరాట విజయం వరకూ చాలా ఆసక్తికరంగా రచించారు. సామాజిక, సాంస్కృతిక రంగాలలో వచ్చిన మార్పులను, వాటికి సంబంధించిన ముఖ్యాంశాలనూ వివరించారు. ఆధునిక సమాజ పరిణామంలో సంఘ సంస్కర్తల పాత్రనూ సమయోచితంగా తెలియజేశారు. పాలకుల దోపిడీ విధానాలు ఎలా మారుతూ వచ్చాయో విశదపరిచారు. శాస్త్ర. " సాంకేతిక విజ్ఞానము, శాస్త్రీయ దృక్పథంతో చరిత్ర అధ్యయనము, సాంస్కృతిక, సామాజిక అవగాహన కలిగిన కాంతారావుగారు ఆధునిక చరిత్రను సుబోధకంగా అందించారు. విద్యార్థులు మాత్రమే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ చదవాల్సిన రచనగా ఇది ఉంది. అందుకనే నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణగా మీ ముందుకు తెస్తున్నది. విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

Browse more Telugu books