Bharatha jaatheeyavadam mathnodha pradam (భారత జాతీయవాదం మతోన్మాద ప్రమాదం)
Editor · Politics

Price: Rs. 165. రాం పునియాని: రచయిత. అనేక లౌకిక సంఘాల్లో పనిచేశారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భాలపై మైనారిటీలపై జరిగిన దాడుల దర్యాప్తు జరిపి నివేదికలను వెల్లడించిన వివిధ సంఘాల్లో ఆయన సభ్యులు. పేలుళ్ల తర్వాత జరిగే అమాయక ముస్లిం యువకుల అరెస్టులపై ఆయన పరిశీలన జరిపారు. ప్రజాస్వామ్యానికి ముంచుకొచ్చిన ప్రమాదంగా మతతత్వ రాజకీయాల ఎజెండాతో సాగుతున్న భీతిగొల్పే రాజకీయాలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్కుషాపులు నిర్వహించారు. 'సెంకండ్ ఎసాసినేషన్ ఆఫ్ గాంధీ" కమ్యూనల్ పాలిటిక్స్ ఫ్యాక్ట్స్ అండ్ రియాల్టీ', 'సోషల్ జస్టిస్' ఇల్లస్ట్రేటెడ్ ప్రైమర్' వంటి అనేక పుస్తకాలు రాశారు. వర్సెస్ మిథ్స్', 'టెర్రరిజం మిత్ 'ఫాసిజం ఆఫ్ సంఘ్ పరివార్' భారతదేశం రూపుదిద్దుకొంటున్న దేశం' అన్న భావనతో పునియాని ఈ పుస్తకం రాశారు. వలసపాలన కాలంనాటి సామాజిక సంస్కృతి దశతో పుస్తకం మొదలవుతుంది. ఆ పరిణామాలు దేశంలో భారత జాతీయ కాంగ్రెస్, హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి కొత్త సంస్థల ఆవిర్భావానికి దారి తీశాయి. అవి పైకి వస్తున్న పాలక వర్గాలైన పరిశ్రమాధిపతులు, వ్యాపారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేవి. దిగజారుతున్న వర్గాలైన భూస్వాములు, రాజులు సంబంధిత బృందాల ప్రయోజనాలకు ముస్లింలీగు ఒక వైపున హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ మరో వైపున ప్రాతినిధ్యం వహించేవి. రెండూ భిన్నమైన జాతీయ గ్రూపులకు సంబంధించినవి. భారతీయ సంస్కృతి వివిధ ప్రాంతాల, భాషల, మతాల మిశ్రమమని పుస్తకం చాటుతుంది. దేశ విభజనకు గల కారణాలతో కశ్మీర్ సమస్య నేపథ్యాన్ని కూడా పుస్తకంలో వివరించారు. భారత రాజ్యాంగంలో పౌరులందరికీ సమాన హక్కులిచ్చే భారతీయ జాతీయత ఉందని రచయిత వాదిస్తారు. దేశ భవిష్యత్ కోసం అన్ని మతాల నైతికతను, స్వాతంత్రోదమ : విలువలను గౌరవించాల్సిన అవసరం నేడు ఎంతో ఉందని రచయిత వివరిస్తారు.