Bharatha Deshamalo Kulalu Erpatu Puttuka, Abivruddi series 13
Editor · History

Price: Rs. 45. మానవ నాగరికతకు సంబంధించిన వస్తువులకు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో- మనమంతా సాక్ష్యంగా ఉంటామని ఖచ్చితంగా చెప్పగలను. అయితే అందులో మానవ వ్యవస్థలకు సంబంధించిన సమాచారం ఉంటుందన్న విషయాన్ని అతి తక్కువ మంది మాత్రమే గుర్తించగలరు. మానవ వ్యవస్థల ప్రదర్శన ఒక వింత. కొంత మంది దీనిని ఒక పిచ్చి వ్యవహారంగా కనిపిస్తుంది. మానవ జాతుల అధ్యయన శాస్త్రానికి చెందిన విద్యార్థులుగా ఈ ఆవిష్కరణ మీకు జీర్ణించుకోలేనిది కాకపోవచ్చని విశ్వసిస్తున్నాను. కనీసం ఇది మీకు వింతగానైనా ఉండకపోవచ్చు. చారిత్రక ప్రాంతమైన పాంపీ వంటి శిథిల ప్రాంతాన్ని మీరంతా సందర్శించి ఉంటారని నమ్ముతున్నాను. గైడ్ చెబుతుండగా, దాని చారిత్రకాంశాలను అత్యంత ఆసక్తితో మీరు వినివుండవచ్చు. మానవ జాతిశాస్త్ర విద్యార్ధులు కూడా ఒక రకంగా ఆ గైడ్ పోషించిన పాత్రనే పోషిస్తారన్నది నా అభిప్రాయం. ఒక పరిశోధకుడు తాను రూపొందించిన వస్తు నమూనాను ఎలా చూస్తాడో మానవ జాతిశాస్త్ర విద్యార్ది కూడా తన సామాజిక వ్యవస్థను అలా చూస్తాడు. హేతుబద్ధత, విచారణల నేపథ్యంలో ఆ వ్యవస్థల ఏర్పాటు, పని తీరును అర్థం చేసుకునేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తాడు. ఆదిమ సమాజానికీ, ఆధునిక సమాజానికీ మధ్య ఉండే తారతమ్యాలపై సెమినార్ దృష్టి సారించినట్లుగా విద్యార్ధులు ఆదిమ సమాజం గురించి కావచ్చు లేదా ఆధునిక సమాజం గురించి కావచ్చు.. మొత్తానికి అదే కోణంలో వివిధ వ్యవస్థల గురించి వివరంగా చెప్పేసి పనిని ముగించేశారు. మిమ్మల్ని ఆనందపరచడంలో భాగంగా ఈ సాయంకాలం నా వంతు వచ్చింది. భారతదేశంలో కులాలు, వాటి పనితీరు, వాటి పుట్టుక, అభివృద్ధి అన్న అంశాలను నేను మీకు వివరిస్తాను.