Bharatha Desampai Lenin Prabhavam
Editor · Best Selling

Price: Rs. 140. గాంధీ, నెహ్రూ, టాగోర్ వంటి మహనీయులు లెనిన్ బోధనల విశిష్టతను గుర్తిస్తూ ఎంతో గౌరవాన్ని లెనిన్ పట్ల ప్రదర్శించారు. లెనిన్ ప్రేరణతో మన దేశంలో కష్టజీవుల ఉద్యమాలు వేగంగా ముందుకు సాగాయి. అందుచేత ప్రపంచంలోని ఏ కష్ట జీవికీ లెనిన్ పరాయివాడు కాదు. ఆనంద్ గుప్తా ఆంగ్లంలో ఈ గ్రంధాన్ని రాసి 45 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత సోషలిజం పెద్ద ఎదురుదెబ్బలు తింది. కాని మళ్ళీ ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి సోషలిజమే పరిష్కారమార్గం చూపగలదు తప్ప తాత్కాలికంగా భ్రమింపజేసిన నయా ఉదారవాద సిద్ధాంతం గాని, విద్వేషాన్ని, విషాన్ని విరజిమ్మే మతోన్మాదం కాని ఎట్టి పరిష్కారాన్నీ చూపలేవు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అందుచేత ఈ గ్రంధాన్ని ప్రతీ ఒక్కరూ చదివి సోషలిజం విశిష్టత గురించి లెనిన్, ఇతర మహనీయులు ఏం చెప్పారో తెలుసుకోవడం అవసరం. మెరుగైన నవ భారతాన్ని ఆశిస్తున్న యువత ఈ విషయంలో ముందుండాలని కోరుతున్నాం.