Bharatha Communist Udhyamam( malupulu- mahasabalu)
Editor · Politics

Price: Rs. 85. భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర సంగ్రహంగా వైనప్పటికీ ఆది నుండి నేటి వరకూ ప్రామాణికంగా రచించబడిన మొట్ట మొదటి గ్రంథమిదే. దానిని రచించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ మన దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఆరు దశాబ్దాలకు పైగా పనిచేస్తూ వచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకులలో కలిసి పనిచేసిన అనుభవం ఉండి ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఆ తరువాత సి.పి.ఐ (ఎం) లోనూ ప్రముఖ పాత్రను నిర్వహించిన విప్లవకారుడాయన. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను రూపొందించడంలో ఆయనకు ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ప్రామాణికతను సంతరించుకున్న గ్రంథమిది.