Bharatha Communist Party Charithra 1920-1964
Editor · Politics

Price: Rs. 200. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా సిపిఐ(ఎం) కేంద్ర పత్రిక 'పీపుల్స్ డెమోక్రసీ', పార్టీ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు, పోరాటాలు, నాటి తరం కమ్యూనిస్టుల త్యాగాలు వాటితోపాటు 1920 అక్టోబర్17న తాష్కెంట్లో మొదటి పార్టీ శాఖ ఏర్పడింది మొదలు 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్పిస్టు) ఏర్పడే వరకు అది తీసుకున్న అనేక విధాన నిర్ణయాలను వివరిస్తూ వారం వారం వ్యాసాలు ప్రచురించింది. వీటిని తెలుగులో 'మార్క్సిస్టు' మాస పత్రికలో వరుసగా ప్రచురించింది. చారిత్రకంగా అతి ముఖ్యమైన ఈ అర్థ శతాబ్ద కాలంలో తొలి తరం కమ్యూనిస్టు యోధులు పార్టీ అభిప్రాయాలను ప్రచారం చేయడంలోనూ, పార్టీ సంస్థలను ఏర్పాటు చేయడంలోనూ, వలస వ్యతిరేక, ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనడంలోనూ, పీడనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాలు జరపడంలోనూ, 1940వ దశకంలో పెద్ద ఎత్తున జరిగిన రైతాంగ, కార్మిక తిరుగుబాట్లలోనూ, పార్లమెంటు, శాసన సభ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా అనుభవాలు గడించడంలోనూ ముందుండి కృషి చేశారు. అలాగే కేరళలో తొలిసారిగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ కాలంలో పార్టీ మీద జరిగిన అనేక దాడులను ఎదుర్కొన్నారు. పార్టీ అంతర్గతంగా అనేక రకాలైన చర్చలు, వివాదాలు ఎదుర్కొన్నారు. చివరికి కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడింది. వలసవాదులతో రాజీపడే కాంగ్రెస్ వైఖరికీ, మితవాద హిందూత్వ పార్టీ బ్రిటీష్ వారికి అనుకూలంగా తీసుకున్న వైఖరికీ భిన్నంగా కమ్యూనిస్టు పార్టీ వలసవాదానికి వ్యతిరేకంగా నికరంగా నిలబడింది. అందువల్ల చరిత్రలో ఈ కాలం నేడు మనం చేస్తున్న పోరాటాలకు ఉపయోగపడే అనేక పాఠాలను మనకు నేర్పుతుంది.