Bharateeya tatvasastram (Set of 4 Vol)
Editor · Literature

Price: Rs. 680. భారతీయ తత్త్వశాస్త్రం ప్రముఖ తత్వవేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంగ్లంలో రచించిన 'ఇండియన్ ఫిలాసఫీ' (Indian Philosophy) గ్రంథం, తెలుగులో "భారతీయ తత్త్వ శాస్త్రము" పేరుతో అనువాదమైంది. ఈ పుస్తకాలు ప్రాచీన వేదాలు, ఉపనిషత్తులు మొదలుకొని భారతీయ దర్శనాల వరకు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. భారతీయ తాత్విక చింతనలో పూసిన పూలన్నిటితోనూ ఒక మాలగట్టి మనకు ఇక్కడ అందిస్తారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈశ్వరవాదం నుంచి నిరీశ్వరవాదం వరకూ అన్ని ధోరణలూ ఈ నాలుగు భాగాలలో మీకు దర్శనమిస్తాయి. రుగ్వేద కాలం నుంచి నేటివరకూ సుమారు నాలుగు వేల సంవత్సరాలపాటు ఈ దేశంలో సాగిన తాత్త్విక చింతన గురించిన స్థూల వివరణ ఇది. వేదాలు, ఉపనిషత్తులు, భౌతికవాదం, జైనమతం, బుద్ధధర్మం, బ్రాహ్మణమతం, మనస్మృతి, భగవద్గీత, న్యాయ వైశేషికాలు, ఆరు బ్రాహ్మణ దర్శనాలు, సాంఖ్యం, పతంజలి యోగశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఈశ్వరవాదంలో ధోరణులు, నిరీశ్వరవాదంలో ధోరణులు, శంకరాద్వైతం, రామానిజుని తత్త్వం, శైవశాక్తేయాది మతాలు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు, చైతన్య గోస్వామి తదితరుల తాత్త్విక ధోరణులూ ఈ గ్రంధాలలో దర్శనమిస్తాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు తత్వచింతనపై ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ గ్రంథాలు అమూల్యమైన సూచికలుగా నిలుస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరియు తత్త్వశాస్త్ర అభిరుచి కలిగిన ప్రతి ఒక్కరికీ ఉపయోగకరమైన reference set.