Bharateeya Charitra Shudra Drukpatham / భారతీయ చరిత్ర శూద్ర దృక్పథం
B. S. RAMULU / బి. ఎస్. రాములు · History

Price: Rs. 405. ఇది భారతీయ చరిత్రను పునరధ్యయనం చేయడం, బుద్ధిజం, మార్క్సిజం, ఫెమినిజం, అంబేద్కరిజం, మానవతావాదం తదితర దృక్పథాలు వెలికి తెచ్చిన కాంతి రేఖలను సంశ్లేషించిన దృక్పథం. ఇది మౌలికంగా భారతీయ చారిత్రక భౌతిక వాదం, పితృస్వామిక వ్యవస్థ ఇండియాలో సృష్టించిన అనేక వాదాలలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ దృక్పథాలు ప్రధానమైనవి. స్త్రీలు పురాతన సమాజంనుండి కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకున్నక్రమంలో అణచివేతకు గురై రెండవ శ్రేణి మానవులుగా మారిన దుస్థితి నేటికీ కొనసాగుతున్నది. ఫెమినిజం ప్రపంచ చరిత్రలన్నిటిని స్త్రీవాద కోణంలో పునర్నిర్మించడం జరుగుతున్నది. మహాత్మా జ్యోతిరావు పూలే 'గులాంగిరి' రచనతో ఆర్యుల దండయాత్రలను, పురుషాధిపత్యాన్ని పురాణ ఇతిహాసాల నుండి వెలికితీసి శూద్ర దృక్పథాన్ని, మూలవాసులైన భారతీయుల దృక్పథాన్ని ముందుకు తెచ్చారు. ఆర్యులు ఎలా విదేశీయులో అనేక నిదర్శనాలు చూపారు. పెరియార్ రామస్వామి నాయకర్ దక్షిణ భారత చరిత్ర, ద్రవిడ చరిత్ర, ఉత్తరాది నుంచి దక్షిణ భారతానికి ప్రస్థానాలు సాగించిన క్రమం కూడా ఉందని, 1921లో వెలికితీసిన హరప్పా, మొహంజొదారో, సింధు నాగరికత ఈ దేశ మూలవాసులదని, ఆర్యులు ఈ దేశ మూలవాసుల నిర్మాణాలను ధ్వంసం చేశారని వివరించారు. శూద్ర అతిశూద్ర మహిళల స్త్రీవాదంచరిత్ర లోలోతుల్లోకి వెళ్లి చరిత్రలో మహిళలు నిర్వహించిన పాత్రను ముందుకు తేవాల్సి ఉంది. అప్పుడే కుటుంబ వ్యవస్థ రూపుదిద్దు కునే క్రమంలో, రూపు దిద్దుకున్న తర్వాత అందులో చొరబడిన వర్ణ కుల సిద్ధాంతాలను సమూలంగా నిర్మూలించడం సాధ్యపడుతుంది. దా॥ బి.ఆర్. అంబేద్కర్ 1918లో వెలువరించిన 'భారతదేశంలో కుబాలు' సిద్ధాంత వ్యాసం మహిళల పై విధించిన కట్టడులవల్లనే పురుషాధిపత్యం, వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ ఎలా ఏర్పడి కొనసాగు తున్నాయో స్పష్టం చేశారు. మార్చ్, ఎంగెల్స్లు భారతదేశాన్ని వర్గ దృక్పథంతో పరిశీలించారు. మోర్గాన్ పరిశోధించిన రాసిన 'పురాతన సమాజం' గ్రంథం ఆధారంగా కుటుంబ వ్యవస్థ, రాజ్యం, పుట్టుక గురించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. మోర్గాన్ పరిశోధన అమెరికన్ మూలవాసుల పరిశోధనకు