Bharata Rajyanga Peetika

మాడభూషి శ్రీధర్ / Maadabhushi Sridhar · Politics

Bharata Rajyanga Peetika book cover

Price: Rs. 225. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇప్పటికి 74 ఏళ్ళు గడిచింది. చట్టసభలకు ఎన్నికయిన ప్రజాప్రతినిధులు, మంత్రి మండలి సభ్యులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, స్పీకర్లు అందరూ 'రాజ్యాంగం' మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి లోబడి కర్తవ్యపాలన చేస్తామని శపధం చేస్తారు. ఈ సందర్భాలు ఏటా జరిపే గణతంత్ర దినోత్సవాలు అప్పుడు తప్పితే మన దేశ 'రాజ్యాంగం' జనం దృష్టికి రాదు. ప్రభుత్వ నిర్ణయాల చట్టబద్ధతను ఎవరైనా సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భాలలో రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగ విస్తృత ధర్మాసనం సదరు వాజ్యాలను విచారించిన సందర్భాలలో మనకు పత్రికా, ప్రసార మాధ్యమాలలో 'రాజ్యాంగం' అన్నమాట వినబడేది తప్పితే జనం కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మీద మాత్రం వివక్షాపూరిత, విద్వేషభరిత వాదనలు మాత్రం విస్తృతంగా చలామణీ అయ్యేవి.

Browse more Telugu books